బాక్సాఫీస్ వద్ద ఆ రికార్డు కూడా చినిగిపోయేలా!
బాక్సాఫీస్ వద్ద అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని సినిమాల విషయంలో ముందే కొన్ని అంచనాలుంటాయి.
By: Tupaki Desk | 23 July 2025 12:14 PM ISTబాక్సాఫీస్ వద్ద అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని సినిమాల విషయంలో ముందే కొన్ని అంచనాలుంటాయి. వాటిని అందుకోవడంలో కొన్ని సఫలమవుతాయి. మరికొన్ని విఫలమవుతుంటాయి. మరికొన్ని మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండా సంచనాలు నమోదు చేస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ లో 'సైయారా' అలాంటి రికార్డుల దిశగానే అడుగులు వేస్తోంది. ఇందులో స్టార్ నటులు లేరు. పెద్దగా ప్రచారం కూడా జరగలేదు. అసలు ఈ సినిమా గురించి జనాలకు నిన్న మొన్నటి వరకూ తెలియను కూడా లేదు.
కానీ నేడు ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మౌత్ టాక్ పవర్ ఏంటో మరోసారి నిరూపించింది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా 5 రోజుల్లోనే 150 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. దీంతో 'ఆషీకీ 2' మొదటి ఐదు రోజుల లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా దర్శ కుడు కూడా 'ఆషీకీ 2' తెరకెక్కించిన మోహిత్ సూరినే కావడం విశేషం. మరోసారి తనదైన మార్క్ ఎమో షన్ పండటంతోనే ఈ ఫీట్ సాధ్య మైంది. అప్పట్లో ఆషీకీ 2 అంత పెద్ద విజయం సాధించిందంటే లవ్ స్టోరీ కం బలమైన ఎమోషన్ ఉండటంతోనే గొప్ప విజయం సాధించింది.
మళ్లీ అదే ఎమోషన్ తో మోహిత్ తన రికార్డను తానే బద్దలు కొట్టాడు. దీంతో సినిమాకు ఎమోషన్ అన్నది ఎంత బలంగా పనిచేస్తుందన్నది మరోసారి ప్రూవ్ అయింది. సింపుల్ లవ్ స్టోరీతోనే ఓ అద్భుతం సృష్టించాడు. క్రిష్ , వాణీ పాత్రలు పోషించిన ఆహాన్ పాండే, అనీత్ పడ్డా ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదిం చుకున్నారు. ఇద్దరు కొత్త వారే అయినా? తమ నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసారు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కొత్త నటీనటులు కాదనే భావనే కలుగుతుంది.
మ్యూజికల్ గానూ మంచి హిట్ అయింది. సినిమా పాటలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 'ఆషీకీ 2' లాంగ్ రన్ లో 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 'సైయారా' కూడా ఆ వసూళ్లను బీట్ చేస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఈ సినిమాకు రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడం కలిసొచ్చింది. కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని బాలీవుడ్ లోనూ మరోసారి ప్రూవ్ అయింది.
