ఆలియా ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా!
కొత్త కుర్రాడు అహాన్ పాండే -కొత్తమ్మాయి అనీత్ పద్దా జంటగా నటించిన `సైయ్యారా` ఈ ఏడాది బెస్ట్ ఓపెనర్ గా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 July 2025 9:41 AM ISTకొత్త కుర్రాడు అహాన్ పాండే -కొత్తమ్మాయి అనీత్ పద్దా జంటగా నటించిన `సైయ్యారా` ఈ ఏడాది బెస్ట్ ఓపెనర్ గా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. ఈ అద్భుత ప్రేమకథా చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. ఆషిఖి 2, ఏక్ విలన్ తర్వాత మోహిత్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంగా ఇది నిలిచింది.
సయ్యారాపై ఇంతకుముందు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో నటించిన డెబ్యూ నటులను, మోహిత్ సూరిని ఆయన ప్రశంసించారు. ఈ సినిమా చూసిన తర్వాత అగ్ర కథానాయిక అలియా భట్ తన ఇన్‌స్టాలో ఒక నోట్ రాసింది. అహాన్ - అనీత్ నటనపై అలియా ప్రశంసల వర్షం కురిపించింది.
''ఇద్దరు అందమైన తారలు పుట్టారు. నేను చివరిసారిగా ఇద్దరు నటులను ఇంత విస్మయంతో ఎప్పుడు చూశానో గుర్తులేదు. నా కళ్ళలో నక్షత్రాలతో.. మీ కళ్ళలోని నక్షత్రాలను చూస్తున్నాను. మీరిద్దరూ ఇంత గొప్ప వ్యక్తిత్వంతో.. ఇంత నిజాయితీతో ప్రకాశిస్తున్నారు.. నేను మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చూడగలను. నిజాయితీగా చెప్పాలంటే.. నేను మళ్లీ ఈ సినిమా చూస్తాను!'' అంటూ ఆలియా వ్యాఖ్యానించింది. ఈ సినిమాను తెరకెక్కించిన మోహిత్ సూరి పైనా ఆలియా ప్రశంసలు కురిపించింది. ఎంతటి గొప్ప అనుభూతి..ఎంతటి అద్భుత సంగీతం! సినిమాలు మాత్రమే మీకు ఇలాంటి అనుభూతినిస్తాయి. సైయారా హృదయంతో, ఆత్మతో నిండి ఉంది. మీతో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అందమైన సృష్టికి అభినందనలు. ఇది కేవలం సినిమా కాదు.. అంటూ ప్రశంసల వర్షం కురిపించింది ఆలియా.
