Begin typing your search above and press return to search.

పొడ‌వుగా ఉంద‌ని క‌ట్ చేసిన‌ హీరో!

ఇండ‌స్ట్రీలో హీరోల ఒరిజిన‌ల్ నేమ్స్ వేరు..స్క్రీన్ నేమ్స్ వేరుగా ఉంటాయి. కొంత మంది ముందుగానే పేరులో మార్పులు చేసుకుంటే.......

By:  Tupaki Desk   |   26 Feb 2024 11:30 PM GMT
పొడ‌వుగా ఉంద‌ని క‌ట్ చేసిన‌ హీరో!
X

ఇండ‌స్ట్రీలో హీరోల ఒరిజిన‌ల్ నేమ్స్ వేరు..స్క్రీన్ నేమ్స్ వేరుగా ఉంటాయి. కొంత మంది ముందుగానే పేరులో మార్పులు చేసుకుంటే..మ‌రికొంత మంది స‌క్సెస వ‌చ్చే క్ర‌మంలో పేర్లు మార్చుకుంటారు. కొన్నిసార్లు వాళ్ల అనుమ‌తి లేకుండానే అభిమానులు ఇచ్చిన పేర్లు తెర మీద పేర్లు అవుతుంటాయి. చిరంజీవి అస‌లు పేరు శివ శంక‌రవ‌ర‌ప్ర‌సాద్. స‌క్సెస్ వ‌చ్చిన త‌ర్వాత త‌ల్లిదండ్రులు పెట్టిన పేరుకు బ‌ధులుగా చిరంజీవిగా ఫేమ‌స్ అయ్యారు.

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అస‌లు పేరు శివాజీ రావ్ గౌక్వాడ కానీ అత‌ని పేరిప్పుడు ర‌జ‌నీకాంత్ గా మారింది. క‌మ‌ల్ హాస‌న్ అస‌లు పేరు శ్రీనివాస‌న్. ఇంకా మ‌హేష్ బాబు మ‌హేష్ గా పిలుస్తున్నాం... రామ్ చ‌ర‌ణ్ తేజ్ ని రామ్ చ‌ర‌ణ్ గా...సాయిధ‌ర‌మ్ తేజ్ ని సాయితేజ్ గా...వైష్ణ‌వ్ తేజ్..పంజా వైష్ణ‌వ్ గా ఇలా వాస్త‌వ పేర్ల‌తో సంబంధం లేకుండా హీరోల పేర్లు మారిపోతుంటాయి. తాజాగా మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ అస‌లు పేరు ఏంటో తెలుసా? అత‌డు ఒరిజిన‌ల్ పేరు తెలిస్తే ఆశ్చ‌ర్యానికి గుర‌వుతాం.

ఇప్ప‌టివ‌ర‌కూ అస‌లు పేరు దాచేసి కొస‌రు పేరుతో హైలైట్ అయిన వ‌రుణ్ అస‌లు పేరు ఏంటో తెలుసా? సాయి వ‌రుణ్ తేజ్ అట‌. తెర మీద అంత పెద్ద పేరు ప‌డ‌టం ఇష్టం లేని వరుణ్ ముందున్న సాయిని తీసేసి వ‌రుణ్ తేజ్ గా మార్చుకున్న‌ట్లు తెలిపాడు. అదే ఫ్యామిలీలో తేజ్ లు కూడా ఎక్కువ‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎవ‌రూ కామ‌న్ గా ఉన్న తేజ్ ని మాత్రం తొల‌గించ‌లేదు.

పేరు ముందు...మ‌ధ్య‌లో ఉన్న వాటిని తొల‌గించి పిలిపించుకుంటున్నారు. వ‌రుణ్ స‌ర్టిఫికెట్స్ ..పాస్ పోర్ట్ అన్నింటిలోనూ వాస్త‌వ పేరు సాయి వ‌రుణ్ తేజ్ అని ఉంటుందిట‌. మ‌రి మొన్న వెడ్డింగ్ కార్డులో ఏమ‌ని వేసారో? అదీ వ‌రుణ్ పుల్ నేమ్ క‌హానీ. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ఆప‌రేష‌న్ వాలంటైన్ రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.