Begin typing your search above and press return to search.

పూరి త‌మ్ముడు అనంత‌పురం అల్లుడా?

కానీ అస‌లు సంగ‌తేంటి అంటే ? సాయిరాంకి ఇద్దరు ఆడ‌పిల్ల‌లు. వాళ్లు చ‌దువుకుంటున్నారు. అత‌డిది ప్రేమ వివాహ‌మా? పెద్ద‌లు కుదిర్చిన పెళ్లా? అన్న‌ది తెలియ‌దు గానీ అనంత‌పురం అల్లుడిని అని ఓపెన్ అయ్యాడు.

By:  Tupaki Desk   |   31 March 2024 2:30 PM GMT
పూరి త‌మ్ముడు అనంత‌పురం అల్లుడా?
X

ఇండ‌స్ట్రీలో పూరి జ‌గ‌న్నాధ్ త‌మ్ముడు..హీరో సాయిరాంశంక‌ర్ సుప‌రిచితుడే. త‌మ్మ‌డ్ని పెద్ద స్టార్ ని చేయా ల‌ని పూరి ఎంతో ప్ర‌య‌త్నించాడు. కానీ తాను అనుకున్న రేంజ్ కి సాయిరాం చేర‌లేదు. అలాగ‌ని సినిమాల‌కు దూరంగా లేడు. త‌న ట్యాలెంట్ తో తాను ఎదిగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. బంప‌ర్ ఆఫ‌ర్ లాంటి సినిమా సాయిరాంకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ సినిమాతో అంద‌రికీ బాగా రీచ్ అయ్యాడు. ఆ త‌ర్వాత చాలా సినిమాలు చేసాడు గానీ అనుకున్న స్థాయిలో స‌క్సెస్ అవ్వ‌లేదు.

ఇటీవ‌లే 'వెయ్ ద‌రువెయ్' అంటూ మ‌రో సినిమాతో కూడా ప్రేక్ష‌కుల ముదుకొచ్చాడు. ఆ సంగ‌తులు ప‌క్క‌న‌బెడితే సాయిరాం శంక‌ర్ ఫ్యామిలీ గురించి మాత్రం మీడియాకి తెలియ‌ని సంగ‌తులు చాలానే ఉన్నాయి. పూరి జ‌గ‌న్నాధ్ ఫ్యామిలీ ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాలో క‌నిపిస్తుంటుంది. భార్య లావ‌ణ్య పిల్ల‌లు ఆకాష్‌..కుమార్తె త‌రుచూ క‌నిపిస్తుంటారు. కానీ సాయిరాం భార్య‌..పిల్ల‌లు ఎక్క‌డా? అంటూ చాలాసార్లు చ‌ర్చ‌కు దారి తీసింది. చాలా మంది ఆయ‌న‌కు ఇంత‌వ‌ర‌కూ పెళ్లి కాలేద‌ని..చేసుకోలేద‌నుకున్న వారు చాలా మంది ఉన్నారు.

కానీ అస‌లు సంగ‌తేంటి అంటే ? సాయిరాంకి ఇద్దరు ఆడ‌పిల్ల‌లు. వాళ్లు చ‌దువుకుంటున్నారు. అత‌డిది ప్రేమ వివాహ‌మా? పెద్ద‌లు కుదిర్చిన పెళ్లా? అన్న‌ది తెలియ‌దు గానీ అనంత‌పురం అల్లుడిని అని ఓపెన్ అయ్యాడు. అనంత‌పురం అమ్మాయిని పెళ్లి చేసుకున్న‌ట్లు ప‌నిగ‌ట్టుకుని అడిగితేచెప్పాడు. లేదంటే? ఆ విష‌యాలు ఎప్ప‌టికీ మీడియాకి దూరంగానే ఉంచేవాడు ఏమో! అవి చెప్ప‌డానికో చాలా అసౌక‌ర్యానికి గురైన‌ట్లు క‌నిపించాడు.

ఇక ఇండ‌స్ట్రీలో త‌న‌కు అన్న‌ల స‌హ‌కారం ఎంతో ఉంద‌ని... ఇప్ప‌టికీ ఉంద‌ని తెలిపాడు. డైరెక్ట‌ర్ అన్న‌య్య కంటే ఎమ్మెల్యే అన్న‌య్య స‌హ‌కారం ఎక్కువ‌గా ఉంటుంద‌న్నాడు. అందువ‌ల్లే ఇలా సినిమాలు చేయ‌గ‌ల్గుతున్నాన‌ని తెలిపాడు. అలాగే స్టార్స్ తో అంటూ పెద్ద‌గా స్నేహాలు లేవుగానీ... డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ వాళ్ల‌తోనే ఎక్కువ‌గా స్నేహ ఉంద‌ని...వాళ్ల‌తోనే రెగ్యుల‌ర్ గా ఉంటాన‌ని తెలిపాడు.