Begin typing your search above and press return to search.

నాన్నకు చెప్పి హామీ ఇచ్చాకే 'బేబీ' బెడ్‌ రూం సీన్‌

ఈ సినిమాతో వైష్ణవి కెరీర్ కు ఏదైనా ఇబ్బంది వస్తే వరుసగా తన మూడు సినిమాల్లో ఛాన్స్ ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చాను

By:  Tupaki Desk   |   26 July 2023 6:21 AM GMT
నాన్నకు చెప్పి హామీ ఇచ్చాకే బేబీ బెడ్‌ రూం సీన్‌
X

ఆనంద్ దేవరకొండ.. వైష్ణవి చైతన్య ముఖ్య పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన 'బేబీ' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. చిన్న సినిమాగా విడుదల అయిన బేబీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా రూ.75 కోట్ల వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా వంద కోట్లు కూడా సాధిస్తుందేమో అన్నంతగా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది.

ఈ నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేష్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ వైష్ణవి చైతన్య పాత్ర గురించి ఆమె గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మొదట వైష్ణవికి ఈ కథ చెప్పిన సమయంలో చేసేందుకు నో చెప్పింది. తాను ఈ కథలో నటించేందుకు భయపడింది. కానీ చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆమె ఓకే చెప్పింది.

ఈ సినిమాలోని బెడ్ రూమ్‌ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో వైష్ణవి తండ్రికి చెప్పి.. ఆయనకి క్లియర్ గా వివరించిన తరువాత, ఆయన ఓకే అన్న తర్వాతే ఆ సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది.

ఆ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే చెప్తే అక్కడే ఆపేస్తానంటూ ముందే నేను వైష్ణవికి చెప్పాను అన్నాడు.

ఈ సినిమాతో వైష్ణవి కెరీర్ కు ఏదైనా ఇబ్బంది వస్తే వరుసగా తన మూడు సినిమాల్లో ఛాన్స్ ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చాను. ఇప్పుడు వైష్ణవి నటనకు మంచి ప్రశంసలు దక్కుతుంటే ఆనందంగా ఉంది. అంతే కాకుండా మరో సాయి పల్లవి అంటూ వైష్ణవిగురించి మాట్లాడుకుంటూ ఉంటే కూడా చాలా సంతోషంగా ఉందని సాయి రాజేష్ పేర్కొన్నాడు.