Begin typing your search above and press return to search.

బేబీ పై ముందే డౌట్ కొట్టిందట

బేబి సినిమా చూసి తిట్టే వాళ్లు తిడుతున్నారు.. పొగిడే వాళ్లు పొగుడుతున్నారన్నారు అయితే.. తాను మాత్రం అన్నింటినీ స్వీకరిస్తానని చెప్పారు.

By:  Tupaki Desk   |   16 July 2023 10:16 AM GMT
బేబీ పై ముందే డౌట్ కొట్టిందట
X

విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన తాజా చిత్రం బేబీ. వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్‌గా టైటిల్ పాత్ర‌లో న‌టించింది. విరాజ్ మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న'క‌ల‌ర్ ఫొటో' సినిమాకు క‌థ అందించ‌డ‌మే కాకుండా నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించిన సాయి రాజేష్ నీలం ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎస్‌కెఎన్ నిర్మించిన ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది

మూవీ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ నటకు ప్రశంసల వర్షం కురస్తోంది. అసలు పెద్దగా గుర్తింపు లేని నటీనటులతో సినిమా తీసి ఊహించని హిట్ అందుకున్నారు. కాగా, ఈ సందర్భంగా బేబీ చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.

కాగా, ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ తాను ఈ కథ రాయడానికి గల కారణాన్ని వివరించారు. తాను రాసే కథలు చాలా ఫాస్ట్ గా ఉంటాయని, కానీ బేబీ మూవీ మాత్రం కాస్త స్లోగా ఉందని అనిపించిందని అన్నారు.

ఆ సమయంలో తనకు ఫస్ట్ కాపీ చూసినప్పుడు భయం వేసిందని అన్నారు. అయినా సరే, ఈ మూవీని మార్చాలని అనుకోలేదని, కావాలంటే ఫాస్ట్ గా ఉండే మరో సినిమా అయినా తీస్తాను, కానీ, ఈ మూవీని ఇలానే విడుదల చేయాలని అనుకున్నానని చెప్పారు.

బేబి సినిమా చూసి తిట్టే వాళ్లు తిడుతున్నారు.. పొగిడే వాళ్లు పొగుడుతున్నారన్నారు అయితే.. తాను మాత్రం అన్నింటినీ స్వీకరిస్తానని చెప్పారు. ఇరవై ఏళ్ల క్రితం తాను ప్రేమించానని, ఆ ఎనిమిది నెలలు నేను నరకం అనుభవించాననని చెప్పారు. ఆ బాధను తెలియజేయాలని ఈ కథ రాసుకున్నానన్నారు.

తాను వైష్ణవి కోణంలో కథ రాయలేదని, ఆనంద్ కోణంలోంచి కథ రాసుకున్నాను అని చెప్పారు. తన తొలిప్రేమ సక్సెస్ అయింది. కానీ ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని, అందుకే ఆ బాధనే కథగా చూపించాలని అనుకున్నట్లు చెప్పారు.

ఇక, సినిమాని ప్రేక్షకుల మధ్య కూర్చొని చూశానని, వారి రియాక్షన్లు, వారు సినిమాని ఆస్వాదిస్తున్న తీరు తనకు సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇదిలా ఉండగా, బేబి సినిమాకు తొలి రోజున చాలా మంచి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. సినిమా రూ.8 కోట్లు వ‌స్తే సేఫ్ జోన్‌లో వెళుతుంది. ఫ‌స్ట్ డే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు, ఓవ‌ర్ సీస్‌లో క‌లిపి రూ.3.5 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఈ వీకెండ్ లో మరిన్ని కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంది.