Begin typing your search above and press return to search.

ఇక నుంచి బేబీ లాంటి సినిమాలే చేస్తా : సాయి రాజేష్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాను ఎస్.కె.ఎన్ నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ అనంతరం చిత్ర యూనిట్ సోమవారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ లో భాగంగా డైరెక్టర్ సాయి రాజేష్ ఎమోషనల్ గా మాట్లాడారు.

By:  Tupaki Desk   |   18 July 2023 6:14 AM GMT
ఇక నుంచి బేబీ లాంటి సినిమాలే చేస్తా : సాయి రాజేష్
X

హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలు చేసిన సాయి రాజేష్ లేటెస్ట్ గా బేబీ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈసారి ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని తెర మీదకు తెచ్చాడు సాయి రాజేష్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాను ఎస్.కె.ఎన్ నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ అనంతరం చిత్ర యూనిట్ సోమవారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ లో భాగంగా డైరెక్టర్ సాయి రాజేష్ ఎమోషనల్ గా మాట్లాడారు.

తను తీసిన కొబ్బరిమట్ట రిలీజ్ టైం లో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నానని.. అయితే ఆ సినిమా రిలీజ్ టైం లో రాజమండ్రి వెళ్లినప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఆరోసారి ఈ సినిమా చూశాడని థియేటర్ వాళ్లు చెప్పారు. అతను తన దగ్గరకు వచ్చి ఏం సినిమా తీశావన్నా అని అన్నాడు. అప్పుడు సినిమాలు ఎలా తీయాలో అర్ధమైందని అన్నారు సాయి రాజేష్. కామెడీ అయినా.. లవ్ స్టోరీ అయినా ఎమోషన్ హై ఉంటే థియేటర్ కి వచ్చినోడికి కూడా ఆ హై ఎమోషన్ ఫీల్ అవుతాడు. అందుకే ఈ సినిమాతో ఆ హై ఎమోషన్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యానని అన్నారు. బేబీ సినిమా చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా ఇక మీదట ఇలానే మంచి సినిమాలు తీస్తే.. రాబోయే సినిమాలు కూడా ఇలానే ఉంటాయని అన్నారు సాయి రాజేష్.

నెల రోజుల క్రితం ఓ పెద్ద సినిమా జూలై 14న రిలీజ్ అవ్వట్లేదని తెలిసి ఎలాగైనా ఈ డేట్ కి సినిమా తీసుకు రావాలని ఫిక్స్ అయ్యాం. నిర్మాత ఎస్.కె.ఎన్ పర్లేదు ఆగష్టుకి వెళ్దామని అన్నా సరే ఎలాగైనా జూలై 14న రిలీజ్ చేయాలని అనుకున్నా జూలై లో రిలీజ్ చేస్తే అది తప్పకుండా హిట్ అవుతుందని తనకు ఒక నమ్మకమని అన్నారు సాయి రాజేష్. ఇక సినిమా రిలీజ్ కోసం నిద్రాహారాలు మానేసి పనిచేసిన ప్రతి ఒక్కరని థాంక్స్ చెప్పారు సాయి రాజేష్. బేబీ సినిమా మ్యూజిక్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ కి లవ్యూ అని చెప్పారు సాయి రాజేష్. సినిమా చూసిన అందరు బిజిఎం బాగుందని అంటున్నారు. అయితే 3 రోజుల్లో బిజిఎం పూర్తిచేశామని అన్నారు.

ఎస్.కె.ఎన్ ఫ్రెండ్ గా ఉండటం నా అదృష్టం.. నువ్వు నమ్మి ఇన్ని డబ్బులు ఇవ్వకపోతే బ్రేక్ వచ్చేది కాదు. బేబీ సినిమా వచ్చింది అంటే అది నీ వల్లే.. ఈరోజు గర్వంగా ఒక సినిమా ఇచ్చానంటే అది నీ వల్లే అని అన్నారు. మారుతి గారి జడ్జ్ మెంట్ కి తిరుగులేదు. స్పెషల్ షో టైం లోనే సినిమా రిజల్ట్ గురించి చెప్పారు. వాసు సార్ మీరు నా బలం.. నన్ను మీరు ఇంకా మంచి డైరెక్టర్ గ చేయాలని అన్నారు సాయి రాజేష్.

ఆనంద్ కోసం కథ రాసుకున్నాక విజయ్ దేవరకొండని అడిగితే వెళ్లి కథ చెప్పు అన్నారు. కానీ నేను హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలు చేశానని చెబితే నీకు నువ్వు ఎందుకు డిస్ రెస్పెక్ట్ చేసుకుంటావ్ అని అన్నారు. విజయ్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే బేబీ వచ్చింది.

ఆనంద్ దేవరకొండ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నా డైరెక్షన్ లో సినిమా అంటే సినిమాలు చేయనని ఒక హీరో అన్నాడు.. ఆ టైం లో నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావ్ అని అన్నారు సాయి రాజేష్. వైష్ణవి చైతన్య ఈ సినిమా తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. సినిమా గురించి వస్తున్న పాజిటివ్స్, నెగటివ్స్ అన్నీ తీసుకో.. సినిమా కోసం ఒక మంచి జాబ్ కూడా వదిలేసి వచ్చిందని అన్నారు సాయి రాజేష్.

విరాజ్ నీ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఇంకా మంచి సినిమాలు చేయాలని అన్నారు సాయి రాజేష్. బేబీ కథ తన కథ అని వస్తున్న వార్తలపై అంతకుముందు ప్రెస్ మీట్ లో స్పందించారు డైరెక్టర్ సాయి రాజేష్. తను ప్రేమించిన అమ్మాయి దూరమైనప్పుడు బాధపడ్డానని అప్పుడే ఈ కథ అనుకున్నానని.. కాకపోతే తను లవ్ ఫెయిల్యూర్ కాదని ప్రేమించిన అమ్మాయినే పెళ్లాడానని అన్నారు. నా పిల్లలు ప్రేమలో పడకూడదని కోరుకుంటున్నానని అన్నారు సాయి రాజేష్.