Begin typing your search above and press return to search.

ఊహించని జాక్ పాట్ కొట్టిన బాలీవుడ్ బ‌డా నిర్మాణ సంస్థ‌!

ఇప్పుడు య‌ష్ రాజ్ ఫిల్మ్స్ కు అదే జ‌రుగుతుంది. వాస్త‌వానికి సైయారా సినిమా య‌ష్ రాజ్ ఫిల్మ్స్ చేయాల్సింది కాద‌ట‌.

By:  Tupaki Desk   |   23 July 2025 5:41 PM IST
ఊహించని జాక్ పాట్ కొట్టిన బాలీవుడ్ బ‌డా నిర్మాణ సంస్థ‌!
X

బాలీవుడ్ లో మంచి మ్యూజికల్ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ వ‌చ్చి చాలా కాల‌మైంది. మారుతున్న ట్రెండ్ లో భాగంగా బాలీవుడ్ లో అలాంటి సినిమాలు రావ‌డ‌మే లేదు. ఆ గ్యాప్ ను పూరిస్తూ రీసెంట్ గా వ‌చ్చిన సైయారా సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. మోహిత్ సూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను య‌ష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన విష‌యం తెలిసిందే.

మ‌నమొక‌టి అనుకుంటే దైవం ఇంకోటి త‌ల‌స్తుందని, అదే జీవిత‌మని పెద్ద‌లు ఊరికే అన‌లేదు. ఇప్పుడు య‌ష్ రాజ్ ఫిల్మ్స్ కు అదే జ‌రుగుతుంది. వాస్త‌వానికి సైయారా సినిమా య‌ష్ రాజ్ ఫిల్మ్స్ చేయాల్సింది కాద‌ట‌. డైరెక్ట‌ర్ మోహిత్ సూరి సైయారా క‌థ‌ను రాసుకున్న త‌ర్వాత ఎంద‌రో నిర్మాత‌ల చుట్టూ తిరిగార‌ట‌. ఇప్పుడు బాలీవుడ్ లో న‌డుస్తున్న ట్రెండ్ కు ఈ రేంజ్ ల‌వ్ స్టోరీని ఎవ‌రు చూస్తార‌ని ఎంతోమంది నిర్మాత‌లు సైయారా క‌థ‌ను రిజెక్ట్ చేశార‌ట‌.

ఆ త‌ర్వాత అక్ష‌య్ విధాని అనే నిర్మాత సైయారాను న‌మ్మి ప్రొడ్యూస్ చేయ‌డానికి ముందుకొచ్చిన‌ప్ప‌టికీ బ‌డ్జెట్ ప్రాబ్ల‌మ్ వ‌ల్ల య‌ష్ రాజ్ ఫిల్మ్స్ స‌పోర్ట్ ను కోరారు మోహిత్ సూరి. క‌థ‌లో మంచి మ్యూజిక్, ల‌వ్ ఎలిమెంట్స్ ఉన్నాయ‌ని గుర్తించి వెంట‌నే య‌ష్ రాజ్ ఆ సినిమాకు ఓకే చెప్పారు. అదే సైయారా మూవీకి ట‌ర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.

ఏ ముహూర్తాన య‌ష్ రాజ్ ఫిల్మ్స్ చేతిలోకి సైయారా సినిమా వ‌చ్చిందో అప్ప‌ట్నుంచి ఆ మూవీ రేంజ్ పెరిగి మూవీపై బ‌జ్ పెరిగిపోయింది. షూటింగ్, రిలీజ్ అన్నీ త్వ‌ర‌త్వ‌ర‌గా జ‌రిగిపోయాయి. నిర్మాత‌లు అనుకున్న‌ట్టే ఈ సినిమాకు యూత్ ఆడియ‌న్స్ బ్ర‌హ్మ‌ర‌థం పడుతున్నారు. అందుకే వారం లోపే సైయారా ఏకంగా రూ.150 కోట్లు వ‌సూలు చేసింది. సైయారా ఈ రేంజ్ లో స‌క్సెస్ అవుతుంద‌ని నిర్మాత‌లు కూడా ఊహించ‌లేదు. సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ ను చూసి ఆగ‌స్ట్ 14న వార్2 వ‌చ్చే వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా సైయారానే ఉండేలా త‌మ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు య‌ష్ రాజ్ సంస్థ ఇప్ప‌టికే ఆదేశాలిచ్చింద‌ని అంటున్నారు. చూస్తుంటే ఈ సినిమా లాంగ్ ర‌న్ లో రూ.500 కోట్ల క్ల‌బ్ లోకి చాలా ఈజీగా అడుగు పెడుతుంద‌నిపిస్తుంది. అలా అని సైయారా నెక్ట్స్ లెవెల్ ల‌వ్ స్టోరీ ఏమీ కాదు కానీ కొన్ని సినిమాలు అలా వ‌ర్క‌వుట్ అవుతుంటాయంతే. ఏదేమైనా ఈ విష‌యంలో య‌ష్ రాజ్ ఫిల్మ్స్ ల‌క్కీ అనే చెప్పాలి.