Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ స్టార్‌ తో 'ఫిదా' చేసేందుకు రెడీనా?

కన్నడ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పలు దఫాలుగా హీరోయిన్ సాయి పల్లవి తో చర్చలు జరిపారట.

By:  Tupaki Desk   |   5 Dec 2023 6:38 AM GMT
కేజీఎఫ్‌ స్టార్‌ తో ఫిదా చేసేందుకు రెడీనా?
X

కేజీఎఫ్‌ సినిమా ముందు వరకు యశ్‌ కేవలం కన్నడ స్టార్‌ మాత్రమే. ఎప్పుడైతే కేజీఎఫ్ తో రాఖీ భాయ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడో అప్పటి నుంచి యశ్‌ పాన్ ఇండియా స్టార్‌ అయ్యాడు అనడంలో సందేహం లేదు. ఆయన కేజీఎఫ్ 2 సినిమా విడుదల అయ్యి చాలా కాలం అయింది. ఆయన తదుపరి సినిమా ను ఇంకెప్పుడు ప్రకటిస్తాడు అంటూ దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.


ఎట్టకేలకు యశ్‌ తదుపరి సినిమా కన్ఫర్మ్‌ అయింది. గీతూ మోహన్‌ దాస్ దర్శకత్వంలో యశ్‌ 19వ సినిమా పట్టాలెక్కబోతుంది. ఈ శుక్రవారం నాడు వీరి కాంబో సినిమా గురించి అధికారిక ప్రకటర రావడంతో పాటు, టైటిల్‌ ను కూడా రివీల్‌ చేయబోతున్నారు. అదే రోజు హీరోయిన్ విషయంలో కూడా దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

కన్నడ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పలు దఫాలుగా హీరోయిన్ సాయి పల్లవి తో చర్చలు జరిపారట. మంచి కథల కోసం వెయిట్‌ చేస్తున్న సాయి పల్లవి యశ్‌ తో కలిసి నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని కన్నడ సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

యశ్‌ మూవీ లో సాయి పల్లవి హీరోయిన్‌ అనే విషయమై అధికారిక క్లారిటీ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులను ఫిదా సినిమా తో ఫిదా చేసి అక్కడి నుంచి అందరినీ తన ప్రేమలో పడేసుకున్న సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య కి జోడీగా ఒక సినిమా ను చేస్తుంది.

తమిళ్‌, తెలుగు లో నటిస్తున్న సాయి పల్లవి కన్నడం లో యశ్‌ తో నటించేందుకు ఓకే చెప్పి ఉంటే కచ్చితంగా ఆమె పాన్‌ ఇండియా హీరోయిన్‌ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే హిందీ ప్రేక్షకులను కూడా తన నటనతో మెప్పించిన సాయి పల్లవి యశ్ తో కలిసి కన్నడ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులను మరోసారి మెప్పించే అవకాశాలు ఉన్నాయి. యశ్ సినిమాకు సాయి పల్లవి క్రేజ్‌, ఇమేజ్ మరింత బలంను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.