Begin typing your search above and press return to search.

డబ్బుతో సాయి పల్లవిని కొనలేరు..!

సౌత్ లో ఇప్పటికి ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఉండగా వాళ్లందరిలో సాయి పల్లవి మాత్రం సెపరేట్ అని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   15 April 2024 3:30 PM GMT
డబ్బుతో సాయి పల్లవిని కొనలేరు..!
X

సౌత్ లో ఇప్పటికి ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఉండగా వాళ్లందరిలో సాయి పల్లవి మాత్రం సెపరేట్ అని చెప్పొచ్చు. మలయాళం ప్రేమంతో సూపర్ పాపులర్ అయిన అమ్మడు తెలుగులో ఫిదాతో ఆడియన్స్ మనసులు దోచేసింది. ఇక అప్పటి నుంచి టాలీవుడ్ లో సాయి పల్లవి కేరాఫ్ అడ్రస్ గా మారింది. కెరీర్ మొదటి నుంచి ఎంచుకునే పాత్రలు.. చేస్తున్న సినిమాల మీద ప్రత్యేకమైన శైలి చూపిస్తుంది సాయి పల్లవి. చాలామంది హీరోయిన్స్ క్రేజ్ రాగానే వచ్చిన సినిమా ప్రతిదీ చేస్తూ డబ్బులు సంపాదిస్తారు.

కానీ సాయి పల్లవి మాత్రం అలా కాదు. ఆమె ఫ్యాన్స్ కూడా సాయి పల్లవిని ఎలా చూడాలని అనుకుంటారో అలాంటి కథలనే ఎంచుకుంటుంది. తనకంటూ ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకుని దాన్ని ఫాలో అవుతున్న సాయి పల్లవి దాన్ని బ్రేక్ చేయాలని అనుకోవట్లేదు. అంతేకాదు తనకు రెమ్యునరేషన్ ఆశ చూపి తనకు నచ్చని పాత్రలు చేయిద్దామనుకున్నా ససేమీరా అనేస్తుంది.

తెలుగులో ఈమధ్య ఒక ప్రాజెక్ట్ అలానే రిజెక్ట్ చేసిందట సాయి పల్లవి. ప్రస్తుతం నాగ చైతన్యతో తండేల్ సినిమా చేస్తున్న సాయి పల్లవి ఆ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. రీసెంట్ గా ఒక బిగ్ ఆఫర్ వచ్చిందట. కానీ ఆ కథ నచ్చక సాయి పల్లవి కాదనేసిందని టాక్. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తామని దర్శక నిర్మాతలు చెప్పినా సరే సాయి పల్లవి నో అనేసిందట.

అడిగిన రెమ్యునరేషన్ ఇస్తే చాలు ఎలాంటి పాత్రలైనా చేసే భామలు కొందరైతే వాళ్లు ఎంత ఇస్తామన్నా సరే తను చేయాల్సిన పాత్రలు తప్ప మిగతా వాటికి నో చెప్పే కథానాయికలు కొందరు. అలాంటి వారిలో సాయి పల్లవి మొదటి ప్లేస్ లో ఉంటుంది. గ్లామర్ గా కాకుండా ప్రేక్షకులను తన అభినయంతోనే మెప్పిస్తూ వస్తున్న సాయి పల్లవి సినిమా సినిమాకు గ్యాప్ తీసుకున్నా ఆమె చేసే పాత్రలతో తన అభిమాన గళాన్ని పెంచుకుంటూ వెళ్తుంది.

సౌత్ లో ఆమె క్రేజ్ చూసి ఇప్పుడు బాలీవుడ్ నుంచి సాయి పల్లవికి ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ రామాయణం తో పాటుగా అమీర్ ఖాన్ తనయుడు సినిమాలో కూడా సాయి పల్లవి నటిస్తుంది. తన యాక్టింగ్ టాలెంట్ తో బీ టౌన్ ఆడియన్స్ ను ఫిదా చేసేందుకు రెడీ అవుతుంది సాయి పల్లవి.