Begin typing your search above and press return to search.

సాయి పల్లవి స్పీడ్ ఆ రేంజ్ లో ఉందట

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి.. ప్రస్తుతం తండేల్ మూవీతోపాటు అమరన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Feb 2024 1:30 PM GMT
సాయి పల్లవి స్పీడ్ ఆ రేంజ్ లో ఉందట
X

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి.. ప్రస్తుతం తండేల్ మూవీతోపాటు అమరన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ కు జోడీగా అమరన్ లో నటిస్తోంది సాయి పల్లవి. విలక్షణ నటుడు కమల్ హాసన్ కు చెందిన రాజ్‌ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తోపాటు సోనీ పిక్చర్స్ ఈ సినిమను తెరకెక్కిస్తోంది. హీరో శివ కార్తికేయన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఇటీవల అమరన్ టీజర్ ను విడుదల చేశారు.

అయితే అమరన్ మూవీలో సాయి పల్లవి రోల్ ఛాలెంజింగ్ గా ఉంటుందని డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాయి పల్లవి, శివకార్తికేయన్‌ ల మధ్య కొన్ని కీలకమైన సీన్స్ ను చిత్రీకరించాల్సి ఉందని చెప్పారు. అమరన్ లోని హై పేస్ డ్యాన్స్ సీక్వెన్స్ చూడనున్నారని పేర్కొన్నారు. మూవీ అవుట్ పుట్ తో కమల్ హాసన్ చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. సాయి పల్లవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

"సాయి పల్లవి యాక్టింగ్ అండ్ వర్క్ కోసం నాకు బాగా తెలుసు. ఆమె మూవీ సెలక్షన్ సూపర్ గా ఉంటుంది. మొదట ఆమెకు నేను స్క్రిప్ట్ ఇవ్వలేదు. జస్ట్ సినిమా స్టోరీ లైన్ చెప్పాను. ఆ తర్వాత స్క్రీన్ ప్రే చదివి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనం ఓ సారి కలవాలని చెప్పింది. ఇక మీట్ అయ్యాక సినిమాపై కొన్ని డౌట్స్ అడిగింది. వాటికి క్లారిటీ ఇచ్చాను. ఆమె షూటింగ్ పార్ట్ మాగ్జిమమ్ కంప్లీట్ అయినట్లే" అని తెలిపారు రాజ్ కుమార్.

"కష్టమైన సన్నివేశాల్లో కూడా ఈజీగా నటించేస్తోంది సాయి పల్లవి. ప్రతి సీన్ పై అధ్యయనం చేస్తోంది. సీన్ కు ముందేంటి, తర్వాత ఏంటినదే కూడా తెలుసుకుంటుంది. సెట్స్ లో పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటుంది. చాలా స్పీడ్ గా యాక్ట్ చేస్తోంది. ఒక్క రోజులో ఆరు సీన్లు కూడా షూట్ చేసే ఛాన్స్ ఇస్తోంది. మేకప్, డ్రెస్సింగ్ విషయంలో జెట్ స్పీడ్ గా ఉంటోంది" అని చెప్పారు.

ఇండియన్ మిల‌ట‌రీ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత‌ ఆధారంగా రాహుల్ సింగ్, శివ్ అరూర్ ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ పేరుతో పుస్త‌కాన్ని రాశారు. ఆ బుక్ ఆధారంగా అమరన్ సినిమాను మేకర్స్ తెర‌కెక్కించారు. స్టోరీ, స్క్రీన్‌ప్లే పై చాలాకాలం క‌ష్ట‌ప‌డి రీస‌ర్చ్ చేశారు రాజ్‌కుమార్ పెరియసామి. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ ఏడాదిలోనే అమరన్ మూవీ రిలీజ్ కానుంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.