Begin typing your search above and press return to search.

ఇది కదా సాయి పల్లవి ఫ్యాన్స్ కోరుకున్నది..!

ప్రేమమ్‌ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టి మొదటి సినిమాతోనే సౌత్ స్టార్‌ హీరోయిన్‌ గా మారి పోయిన ముద్దుగుమ్మ సాయి పల్లవి.

By:  Tupaki Desk   |   6 Dec 2023 5:46 AM GMT
ఇది కదా సాయి పల్లవి ఫ్యాన్స్ కోరుకున్నది..!
X

ప్రేమమ్‌ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టి మొదటి సినిమాతోనే సౌత్ స్టార్‌ హీరోయిన్‌ గా మారి పోయిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. తెలుగు లో ఫిదా సినిమాతో ఫిదా చేసి టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌ జాబితాలో చేరడం మాత్రమే కాకుండా భారీ పారితోషికం కూడా అందుకున్న ఘనత దక్కించుకుంది.

ఏడాదికి అయిదు ఆరు సినిమాలు చేసేంత క్రేజ్ ని, ఇమేజ్ ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి అనూహ్యంగా 2023 సంవత్సరంలో ఒక్క సినిమాని కూడా చేయలేదు. ఈ ఏడాది ఆమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. గత ఏడాది వచ్చిన విరాట పర్వం తర్వాత ఆమె కనిపించలేదు.

ఏడాది కాలం పాటు ఆమె ఎలాంటి సినిమాలకు ఓకే చెప్పక పోవడంతో ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని భావిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. భారీ పారితోషికాలతో ఆఫర్ చేసినా కూడా సాయి పల్లవి పలువురు స్టార్‌ హీరోల సినిమాలకు నో చెబుతూ వచ్చింది.

ఎట్టకేలకు సాయి పల్లవి సినిమాలకు ఓకే చెబుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా సాయి పల్లవి నాలుగు సినిమాలకు ఓకే చెప్పింది. అందులో కొన్ని సినిమాల షూటింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. తమిళ్ లో ఒక సినిమాను చేస్తున్న సాయి పల్లవి తెలుగు లో చైతూ కు జోడీగా తండేల్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

తాజాగా మలయాళంలో నివిన్‌ పౌలీ తో ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పింది. వీరిద్దరి కాంబోలో ప్రేమమ్‌ వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇన్నేళ్ల తర్వాత సాయి పల్లవి అతడితో సినిమాకు రెడీ అయ్యింది. ఇక అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న యశ్‌ 19 సినిమాలో కూడా సాయి పల్లవి హీరోయిన్‌ అనే వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి సాయి పల్లవి అభిమానులు ఏమైతే కోరుకుంటున్నారో అదే జరుగుతోంది. ఆమె వరుసగా సినిమాలు చేయాలని, ఆ సినిమాలు పాన్‌ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వాలని ఆశిస్తున్నారు. సాయి పల్లవి అన్ని భాషల్లో కూడా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కి సంతోషాన్ని కలిగిస్తోంది.