Begin typing your search above and press return to search.

సీతమ్మ తల్లి పాత్రకు సాయి పల్లవే పర్ఫెక్ట్.. ఎందుకంటే?

గ్లామర్ రోల్స్ కు నో చెబుతూ.. పాత్రకు స్కోప్ ఉన్న సినిమాలే ఎంచుకుంటూ టాలీవుడ్ లో తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది

By:  Tupaki Desk   |   16 April 2024 3:30 PM GMT
సీతమ్మ తల్లి పాత్రకు సాయి పల్లవే పర్ఫెక్ట్.. ఎందుకంటే?
X

ఫిదా మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి.. తన మొదటి సినిమాతో అందరినీ ఫిదా చేసేసిన విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. తన డ్యాన్స్ తో స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది. గ్లామర్ రోల్స్ కు నో చెబుతూ.. పాత్రకు స్కోప్ ఉన్న సినిమాలే ఎంచుకుంటూ టాలీవుడ్ లో తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది

తన వద్దకు వచ్చిన ప్రాజెక్టుల్లో ఎంతటి స్టార్ కాస్టింగ్ ఉన్నా.. కథ నచ్చకపోయినా, రోల్ కు స్కోప్ లేకపోయినా వెంటనే సింపుల్ గా రిజెక్ట్ చేసేస్తోంది. ఇలా ఇప్పటి వరకు ఆమె ఎన్నో మూవీలు రిజెక్ట్ చేసింది. ప్రస్తుతం తెలుగులో తండేల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగ చైతన్యకి జోడీగా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది.

ఇక సాయి పల్లవి.. బాలీవుడ్ రామాయణ్ లో నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా సెట్స్ లో ఆమె అడుగు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్ కనిపించనున్నారు. రేపు(ఏప్రిల్ 17) శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. దీంతో నెట్టింట ఆమె ఫ్యాన్స్ ఫుల్ సందడి చేస్తున్నారు.

అయితే మైథలాజికల్ సినిమాల్లోని పాత్రలకు నటీనటుల ఎంపిక కాస్త కష్టమైన పనే. గతంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిన మూవీల్లో నటీనటుల సెలక్షన్ పై ట్రోల్స్ వచ్చాయి. గత ఏడాది ఆదిపురుష్ లో కృతి సనన్ సీతగా నటించగా.. చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో సీత పాత్రకు కంగన రనౌత్ పేరు వినిపించగా.. నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు.

కానీ సాయి పల్లవి విషయంలో ఇప్పటి వరకు ఒక్క ట్రోల్, నెగిటివ్ పోస్ట్ కూడా కనిపించలేదు. డైరెక్టర్ నితీష్ తివారీ నిర్ణయాన్ని అంతా స్వాగతించేసినట్లే. ఎందుకంటే ఇప్పటి వరకు సాయి పల్లవి చేసిన రోల్స్ విషయంలో ఎప్పుడూ నెగిటివిటీ రాలేదు. పక్కింటి అమ్మాయిలా తెరపై కనిపిస్తోంది. స్క్రీన్ పైనే కాకుండా బయట కూడా పద్దతిగా కనిపిస్తుంటోంది.

దీంతో సాయి పల్లవి సీత పాత్ర చేయడం పట్ల సినీ ప్రియులు, ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. నితీష్ తివారీ సరైన నిర్ణయం తీసుకున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. సాయి పల్లవి మరోసారి స్పెషల్ యాక్ట్రెస్ అని ప్రూవ్ చేసుకుందని సందడి చేస్తున్నారు. కాగా, రామాయణాన్ని మూడు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు నితీష్ తివారీ. మరి ఈ సినిమాతో సాయి పల్లవి ఎలాంటి పేరు సంపాదించుకుంటుందో చూడాలి.