Begin typing your search above and press return to search.

సాయి పల్లవి... సన్నాఫ్‌ సూపర్ స్టార్‌

బాలీవుడ్ సూపర్ స్టార్‌ అమీర్ ఖాన్ తనయుడు జునైద్‌ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 10:30 AM GMT
సాయి పల్లవి... సన్నాఫ్‌ సూపర్ స్టార్‌
X

లేడీ పవర్‌ స్టార్‌ అంటూ అభిమానులు పిలుచుకునే ఫిదా బ్యూటీ సాయి పల్లవి గత ఏడాది పెద్దగా సినిమాలు చేయలేదు. ఆ గ్యాప్ ని ఫిల్ చేసే విధంగా ఈ ఏడాది ఏకంగా నాలుగు అయిదు సినిమాలకు కమిట్ అయ్యింది. అందులో మూడు సినిమాలు ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా మరో రెండు మూడు త్వరలో షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

తమిళ్ మరియు తెలుగు సినిమాల్లోనే కాకుండా సాయి పల్లవి బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్‌ అమీర్ ఖాన్ తనయుడు జునైద్‌ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు... కానీ తాజాగా లీక్ అయిన ఫోటోలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి.

జునైద్‌ ఖాన్‌ మొదటి సినిమా మహారాజ్‌ విడుదలకు సిద్ధం అవుతోంది. ఇదే సమయంలో ఆయన రెండో సినిమా కూడా షురూ అయ్యింది. అమీర్ ఖాన్‌ స్వయంగా నిర్మిస్తున్న జునైద్‌ రెండో సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జపాన్ లో నిర్వహిస్తున్నారట. జునైత్‌ తో పాటు సాయి పల్లవి కూడా తాజా షెడ్యూల్‌ లో పాల్గొంటుందట.

షూటింగ్ గ్యాప్‌ లో జునైద్‌ మరియు సాయి పల్లవి మంచు లో సరదాగా ఆడుతున్న ఫోటోలు రెండు సోషల్‌ మీడియాలో లీక్ అయ్యాయి. దాంతో ఇద్దరు కలిసి నటిస్తున్నారు అంటూ కన్ఫర్మ్‌ అయ్యింది. కంటెంట్‌ ఓరియంటెడ్‌ పాత్రలకు మాత్రమే ఓకే చెప్పే ఈ అమ్మడు జునైద్‌ తో చేస్తున్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఇక తెలుగులో సాయి పల్లవి తండేల్‌ సినిమాలో నాగ చైతన్య కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. తమిళ్ లో శివకార్తికేయన్ కు జోడీగా కూడా ఈమె నటిస్తోంది. గతంలో హిందీ ప్రేక్షకులను వెబ్‌ సిరీస్‌ తో పలకరించిన సాయి పల్లవి ఈసారి జునైద్‌ ఖాన్ సినిమాతో పలకరించబోతుంది. మరి బాలీవుడ్‌ లో సాయి పల్లవి కి హిట్‌ దక్కేనా చూడాలి.