Begin typing your search above and press return to search.

సాయి పల్లవి ఆనందం ఆత్రుత...!

ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందబోతున్న రామాయణం సినిమా కాస్టింగ్ ఎంపిక జరుగుతుంది.

By:  Tupaki Desk   |   16 Oct 2023 9:27 AM GMT
సాయి పల్లవి ఆనందం ఆత్రుత...!
X

ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ఇతర భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి ఈ మధ్యకాలంలో కాస్త సినిమాల ఎంపిక విషయంలో అ శ్రద్ధ చూపిస్తుందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చిన మంచి ఆఫర్స్ చేజేతులా వదులుకొని చిన్న చితక సినిమాల్లో నటిస్తోంది అంటూ కొందరు ఈమెని ట్రోల్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈమె మళ్లీ సౌత్ తో పాటు ఇతర భాషల్లో బిజీ అయ్యేందుకు సినిమాలు కమిట్ అయింది.

ముందు ముందు మరిన్ని సినిమాలతో సాయి పల్లవి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామాయణం సినిమాలో సీత పాత్రకి సాయి పల్లవి ఎంపిక అయింది. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందబోతున్న రామాయణం సినిమా కాస్టింగ్ ఎంపిక జరుగుతుంది. అందులో భాగంగా దర్శకుడు ఇటీవల సాయి పల్లవిని సంప్రదించాడని.. త్వరలోనే కథ చెప్పబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఆ ప్రాజెక్టు విషయం సాయి పల్లవి తాజాగా క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు నితీష్ తివారి తనకు ఈ ఛాన్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.. సీత పాత్రను ఇప్పటి వరకు ఎంతో మంది గొప్ప హీరోయిన్స్ పోషించారు. వారు కనబరిచిన నటనలో తాను పది శాతం కనబరిచిన కూడా విజయం సాధించినట్లే. కనుక తాను ఆ 10 శాతం నటనను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాను అన్నట్లుగా సాయి పల్లవి చెప్పుకొచ్చింది. హీరోయిన్గా సాయి పల్లవి ఇప్పుడు వరకు భిన్నమైన పాత్రలో కనిపించింది అయితే సీత పాత్ర అనేది కచ్చితంగా మనకు ఒక ఛాలెంజింగ్ రోల్..

అంతే కాకుండా ఆమె స్థాయిని చూపించగల సినిమా అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి రామాయణం సినిమాలో ఛాన్స్ రావడం పట్ల చాలా ఆనందంతో కనిపిస్తోంది. అంతే కాకుండా ఏప్పుడప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందా అంటూ ఆత్రుతగా ఎదురు చూస్తోంది. రామాయణం సినిమా రావడానికి మరో రెండు మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు సాయి పల్లవి ఫ్యాన్స్ కాస్త ఓపిక పట్టాల్సిందే ,