Begin typing your search above and press return to search.

చెల్లి ఎంగేజ్మెంట్ లో సాయి పల్లవి పవర్ఫుల్ జోష్

ఇంట్లో పెద్దవాళ్ళను ఒప్పించి మరి ప్రియుడితో మూడు ముళ్ళు వేయించుకునేందుకు రెడీ అయింది.

By:  Tupaki Desk   |   22 Jan 2024 12:25 PM GMT
చెల్లి ఎంగేజ్మెంట్ లో సాయి పల్లవి పవర్ఫుల్ జోష్
X

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ పెళ్లికి సిద్ధమైన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సాయి పల్లవి ఇంటి వద్ద పెళ్లి సందడి వాతావరణం నెలకొంది. తన చెల్లి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన పనులన్నీ సాయి పల్లవి దగ్గరుండి మరీ చూసుకుంటుంది. ఇక పూజ కన్నన్ లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళను ఒప్పించి మరి ప్రియుడితో మూడు ముళ్ళు వేయించుకునేందుకు రెడీ అయింది.

ఈ క్రమంలోనే ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. ఈ విషయాన్ని పూజా కన్నన్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేసింది. ఎంగేజ్‌మెంట్‌ సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయని చెబుతూ కొన్ని ఫొటోలను సైతం షేర్‌ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా తన చెల్లెలి ఎంగేజ్మెంట్ వేడుకలో సాయి పల్లవి డాన్స్ చేస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. సాయి పల్లవి ఎంత మంచి డాన్సరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె డాన్స్ కే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

స్క్రీన్ పై తన డాన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న సాయి పల్లవి తాజాగా తన చెల్లెలు పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ వేడుకలో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ వీడియోలో సాయి పల్లవి ఎంతో పద్ధతిగా లైట్ గ్రీన్ కలర్ శారీ కట్టుకొని సరదాగా డాన్స్ చేస్తూ కనిపించింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా పూజా కన్నన్ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరు వినీత్. కొన్నాళ్ళు తన బాయ్ ఫ్రెండ్ తో ప్రేమలో ఉన్న పూజా.. రీసెంట్ గా పొంగల్ సందర్భంగా బాయ్‌ఫ్రెండ్‌ వినీత్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పరిచయం చేసింది. తమ పెండ్లికి పెద్దలు ఒప్పుకున్నారని.. త్వరలోనే తమ పెళ్లి కూడా జరగనున్నట్లు హింట్‌ ఇచ్చింది.

ఇక సాయి పల్లవి విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన 'తండెల్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో మరోసారి పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.