Begin typing your search above and press return to search.

సాయి పల్లవి కోసం ఎదురుచూపులు..!

హీరోయిన్స్ లోనే సాయి పల్లవి సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. అందుకే ఆమె కోసం సౌత్ ఆడియన్స్ పిచ్చెక్కిపోతుంటారు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 6:21 PM GMT
సాయి పల్లవి కోసం ఎదురుచూపులు..!
X

హీరోయిన్స్ కి ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు గ్లామర్ షోతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తే కొందరు కేవలం తన అభినయంతోనే వారి హృదయాల్లో స్థానం సంపాదించుకుంటారు. అయితే ఈతరం నాయికల్లో గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసే వాళ్లే ఎక్కువమంది కాగా నటనతో ఆడియన్స్ కి దగ్గరయ్యే వారి శాతం తక్కువే అని చెప్పొచ్చు.

అలాంటి వారిలో చెప్పుకునే లిస్ట్ లో ఫస్ట్ వస్తుంది కేరళ కుట్టి సాయి పల్లవి. మలయాళ ప్రేమమ్ సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు ఆ సినిమాతోనే సౌత్ సెన్సేషన్ గా మారింది.

ఇక ఆ క్రేజ్ తో తెలుగులో ఫిదా అవకాశం అందుకుంది. ఫిదా నుంచి టాలీవుడ్ లో సాయి పల్లవి సినిమా ప్రస్థానం గురించి తెలిసిందే. ఆమె సినిమాలో ఉంది అంటే సినిమా సంథింగ్ స్పెషల్ అనే క్రేజ్ తెచ్చుకుంది. అయితే కథల ఎంపికలో సాయి పల్లవి చాలా ప్రత్యేకంగా ఉంటుందట. సినిమాలో కథానాయిక పాత్రకు ఏమాత్రం వాల్యూ లేకపోయినా వెంటనే రిజెక్ట్ చెప్పేస్తుందట. ఇక గ్లామర్ షో చేసే పాత్రలకు ఆమె అసలే ఆసక్తి చూపించదు.

హీరోయిన్స్ లోనే సాయి పల్లవి సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. అందుకే ఆమె కోసం సౌత్ ఆడియన్స్ పిచ్చెక్కిపోతుంటారు. తెలుగు ఫ్యాన్స్ అయితే ఆమెకు లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చేశారు. తెలుగులో లాస్ట్ ఇయర్ విరాట పర్వం చేసిన సాయి పల్లవి ఆ సినిమా తర్వాత మరో సినిమాకు సైన్ చేయలేదు. గార్గి అనే సినిమా వచ్చినా అది కూడా వర్క్ అవుట్ కాలేదు.

ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న ఓ తమిళ సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి చందు మొండేటి నాగ చైతన్య కాంబోలో వస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఆల్రెడీ నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమా చేసిన సాయి పల్లవి ఆ హిట్ కాంబో రిపీట్ చేయాలని చూస్తుంది.

అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి మహానటి కీర్తి సురేష్, సహజ నటి సాయి పల్లవి ఇద్దరు ఒకే సినిమాలో అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. మరి సాయి పల్లవి ఈ సినిమాకైనా ఓకే చెబుతుందా లేదా అన్నది చూడాలి. సాయి పల్లవి నెక్స్ట్ తెలుగు సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.