Begin typing your search above and press return to search.

విజయ్ హీరోయిన్ కోసం పెద్ద స్కెచ్చే!

కానీ ఇంతలో సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు మరో టాక్ వినిపిస్తోంది. స్టోరీ విని నేచురల్ బ్యూటీ ఓకే చేసినట్లు కూడా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   18 May 2024 6:28 AM GMT
విజయ్ హీరోయిన్ కోసం పెద్ద స్కెచ్చే!
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన అప్ కమింగ్ మూవీస్ పై కంప్లీట్ ఫోకస్ పెట్టారు. ఆచి తూచి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చినా.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేక పోయారు. దీంతో ఇప్పుడు గట్టి హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న మూవీతో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ కానుంది.

ఈ సినిమాతో పాటు ఇటీవల బర్త్ డే సందర్భంగా రెండు కొత్త చిత్రాలను విజయ్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రాహుల్ సాంకృత్యాన్, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో చెరో మూవీ చేయనున్నారు. అయితే రవి కిరణ్ కోలాతో చేయనున్న మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమాను కూడా ఆయనే ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మరోసారి విజయ్ తో వర్క్ చేయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్.. మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీని రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్ ఫిక్స్ అయినట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఖుషి సినిమాకు గాను విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సమంత.. మళ్లీ దేవరకొండతో జత కట్టనున్నట్లు టాక్ వినిపించింది.

కొన్నేళ్ల క్రితం రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో సమంత తన యాక్షన్ తో అదరగొట్టేసింది. దీంతోపాటు శాకుంతలం టైమ్ లో సమంతతో సినిమా చేస్తానని దిల్ రాజు మాటిచ్చారట. అందుకే సామ్.. విజయ్- దిల్ రాజు మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంతలో సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు మరో టాక్ వినిపిస్తోంది. స్టోరీ విని నేచురల్ బ్యూటీ ఓకే చేసినట్లు కూడా తెలుస్తోంది.

అయితే రూరల్ బ్యాక్ డ్రాప్ లోని రోల్ కు సాయి పల్లవి కరెక్ట్ గా సరిపోతుందని, అందుకే ఆమెను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. నాగ చైతన్య తండేల్ లో కూడా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది సాయి పల్లవి. మొత్తానికి ఇంకా సెట్స్ పై వెళ్లకుండానే విజయ్- రవి కిరణ్ కోలా మూవీ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. మరి ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.