Begin typing your search above and press return to search.

సాయిపల్లవి చెల్లి ఎంగేజ్మెంట్.. ఆ అబ్బాయిని చూశారా..

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సోదరి పూజ కన్నా గురించి అందరికీ తెలిసిందే. సాయి పల్లవి బాటలోనే ఈమె కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది.

By:  Tupaki Desk   |   23 Jan 2024 11:33 AM GMT
సాయిపల్లవి చెల్లి ఎంగేజ్మెంట్.. ఆ అబ్బాయిని చూశారా..
X

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సోదరి పూజ కన్నా గురించి అందరికీ తెలిసిందే. సాయి పల్లవి బాటలోనే ఈమె కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తెలుగు సినిమాలు కాకుండా కేవలం తమిళ భాష చిత్రాల్లో నటిస్తోంది. అయితే సాయి పల్లవి, పూజ ఇద్దరు కూడా కవల పిల్లల్లానే కనిపిస్తూ ఉంటారు. తరచూ సాయి పల్లవి తన చెల్లెలు గురించి.. తనతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది..


త్వరలో సాయిపల్లవి ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆమె చెల్లి పూజ.. తన ప్రియుడు వినీత్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. వినీత్ తో పూజ కన్నా ఎంగేజ్మెమెంట్ ఇటీవలే గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోలను పూజ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఒక పెద్ద కుటుంబం, నిండు హృదయాలు, నా హృదయంలో లేని చాలా ప్రేమ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.


పూజ షేర్ చేసిన నిశ్చితార్థం ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. అలాగే తనకు కాబోయే భర్త ఏం చేస్తారన్న విషయాన్ని కూడా పూజ ఇప్పటి వరకు చెప్పలేదు. తన ఎంగేజ్మెంట్ జనవరి 21వ తేదీన జరిగినట్లు పూజ పేర్కొంది. ఫ్యామిలీ పిక్ లో సాయి పల్లవి ఎవర్ గ్రీన్ గా కనిపిస్తోంది.


అయితే పూజ ఎంగేజ్మెంట్ వేడుకల్లో సాయి పల్లవి డ్యాన్స్ తో అదరగొట్టేసింది. చాలారోజుల తర్వాత స్టెప్పులేసేసరికి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈమె అభిమానులు అయితే డ్యాన్స్ చూసి ఫిదా అయిపోతున్నారు. అయితే గత రెండేళ్ల నుంచి సినిమాలు ఒప్పుకోక పోయేసరికి ఈమెకి పెళ్లి ఫిక్స్ అయిందని, యాక్టింగ్ పక్కనపెట్టేసిందని రూమర్స్ వచ్చాయి. కానీ తమిళంలో ఓ మూవీ, తెలుగులో తండేల్ చేస్తుందనేసరికి అందరూ రిలాక్స్ అయిపోయారు.


ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి.. ఆ తర్వాత తెలుగు, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బోలెడంత ఫేమ్ సంపాదించింది. మరోవైపు, 2017లో అజిత్ దర్శకత్వం వహించిన కారా అనే షార్ట్ ఫిల్మ్‌తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది పూజ. 2021లో చిత్తిరై సెవ్వానం చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి లో ప్రొఫైల్‌ను మెయింటైన్ చేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచింది.