Begin typing your search above and press return to search.

లేడీ పవర్ స్టార్‌ ఓల్డ్‌ వీడియో వైరల్‌

సౌత్‌ తో పాటు నార్త్‌ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు గత ఏడాది పెద్దగా సినిమాలు చేయలేదు.

By:  Tupaki Desk   |   16 April 2024 1:19 PM GMT
లేడీ పవర్ స్టార్‌ ఓల్డ్‌ వీడియో వైరల్‌
X

ఫిదా సినిమా తో ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ప్రేమమ్‌ సినిమాతో సౌత్‌ ఇండియా మొత్తంలో కూడా పాపులారిటీని సొంతం చేసుకున్న సాయి పల్లవి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్ అనడంలో సందేహం లేదు.

సౌత్‌ తో పాటు నార్త్‌ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు గత ఏడాది పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ ఈ ఏడాది మాత్రం ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఫ్యాన్స్‌ ముద్దుగా లేడీ పవర్ స్టార్‌ అంటూ పిలుచుకునే సాయి పల్లవి పాత వీడియో లు అప్పుడప్పుడు వైరల్‌ అవుతూ ఉన్నాయి. ఆ మధ్య తెలుగు టీవీ ఛానల్‌ ఢీ లో సాయి పల్లవి పాల్గొన్న పాత వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ హడావుడి చేశాయి.

ఇప్పుడు సాయి పల్లవి కాలేజ్ ఫెస్ట్‌ లో షీలా కీ జవానీ పాటకు డాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ప్రత్యక్ష్యం అయ్యింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె ఫ్యాన్స్ నెట్టింట ఆ వీడియోను తెగ వైరల్‌ చేస్తున్నారు.

ఈ స్థాయి డాన్సర్ కనుకే సాయి పల్లవికి సినిమాల్లో ఇంతటి క్రేజ్ అనడంలో సందేహం లేదు. కాలేజ్ డేస్‌ లోనే సాయి పల్లవి డాన్స్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉండే వారని టాక్‌. ఈ డాన్స్ చూస్తూ ఉంటే అందులో అబద్దం ఏమీ లేదు అనిపిస్తూ ఉంది. మొత్తానికి సాయి పల్లవి మరో సారి నెట్టింట వైరల్‌ అవుతోంది.