Begin typing your search above and press return to search.

లేడీ పవర్ స్టార్ ని మనవాళ్లు మర్చిపోవాల్సిందేనా..?

మలయాళ సినిమాతో కెరీర్ మొదలు పెట్టినా సరే తన న్యాచురల్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచింది సాయి పల్లవి

By:  Tupaki Desk   |   1 May 2024 4:23 AM GMT
లేడీ పవర్ స్టార్ ని మనవాళ్లు మర్చిపోవాల్సిందేనా..?
X

మలయాళ సినిమాతో కెరీర్ మొదలు పెట్టినా సరే తన న్యాచురల్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచింది సాయి పల్లవి. ప్రేమం తో ఆమె కెరీర్ మొదలు పెట్టి ఫిదాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వగా అప్పటి నుంచి ఆమెకు వరుస ఛాన్సులతో స్టార్ రేంజ్ క్రేజ్ వచ్చేలా చేశారు. అంతేకాదు లేడీ పవర్ స్టార్ ట్యాగ్ తో ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. సాయి పల్లవి అందరికన్నా ప్రత్యేకమని ఎందుకు చెబుతారు అంటే ఆమె కథ నచ్చకపోతే ఎలాంటి సినిమా అయినా నిర్మొహమాటంగా చేయనని చెప్పేస్తుంది.

అలా కథల ఎంపికలో ఉన్న క్లారిటీ వల్లే ఆమె సక్సెస్ ఫుల్ ఫాం కొనసాగిస్తుందని చెప్పొచ్చు. విరాటపర్వం తర్వాత సాయి పల్లవి రెండేళ్లు గ్యాప్ తీసుకుంది. తెలుగులో ఈమధ్యనే నాగ చైతన్యతో తండేల్ సినిమాకు సైన్ చేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా లో సాయి పల్లవి పాత్ర కూడా సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

తండేల్ కు ముందు ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కాదన్న సాయి పల్లవి సౌత్ ని వదిలి బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ఇప్పటికే నితీష్ తివారి చేస్తున్న బాలీవుడ్ రామాయణం లో సీతగా చేస్తున్న సాయి పల్లవి అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సినిమాలో కూడా నటిస్తుంది.

సౌత్ లో ఎంత పెద్ద స్టార్ స్టేటస్ వచ్చినా బాలీవుడ్ సినిమా ఆఫర్ రాగానే మొదటి ప్రియారిటీ అక్కడే ఇస్తారు. సో అందరిలానే సాయి పల్లవి కూడా బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. తెలుగులో ఎలాగు తనకు నచ్చిన పాత్రలు రావట్లేదని ఫిక్స్ అయిన అమ్మడు పూర్తిగా కెరీర్ ని బాలీవుడ్ పైనే పెట్టాలని అనుకుంటుంది.

టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలకు ఎలాగు సాయి పల్లవి ఓకే చెప్పే ఛాన్స్ లేదు. అమ్మడు ఓకే చేయాలంటే ప్రత్యేకమైన కథలు ఉండాల్సి ఉంటుంది. సో అలాంటి కథలు కుదిరినప్పుడు సాయి పల్లవిని సంప్రదించే ఛాన్స్ ఉంటుంది. అప్పటిదాకా సాయి పల్లవిని మర్చిపోవాల్సిందే అని చెప్పొచ్చు. అయితే సాయి పల్లవి హిందీలో కూడా ఎలాంటి సినిమాలు పడితే అలాంటి సినిమాలు చేసే అవకాశం లేదు. సౌత్ లో ఎలాగైతే అభినయ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసిందో నార్త్ లో కూడా అలాంటి కథలకే ఓకే చెబుతుంది.