Begin typing your search above and press return to search.

సాయి పల్లవి కోసం కొత్త కథలు..!

అయితే కథల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వదు కాబట్టే సాయి పల్లవి సినిమా సినిమాకు కొంత లేట్ అవుతూ వస్తుంది.

By:  Tupaki Desk   |   27 July 2023 3:30 PM GMT
సాయి పల్లవి కోసం కొత్త కథలు..!
X

మలయాళ ప్రేమంతో సూపర్ పాపులర్ అయిన సాయి పల్లవి ఆ తర్వాత తెలుగులో ఫిదా తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా నుంచి అమ్మడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకుంది. ఏదైనా సినిమాల్లో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.

అభినయానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అంటే ఆ ఛాన్స్ సాయి పల్లవికి తప్ప మరెవరికి ఇవ్వకూడదు అన్న రేంజ్ కి ఆమె వెళ్లింది. తనకు వచ్చిన పాత్రలను చేస్తూ మెప్పిస్తున్న సాయి పల్లవి తెలుగులో లేడీ పవర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తున్న ఈ ప్రేమకి సాయి పల్లవి ఎన్నోసార్లు ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయి.

సినిమా కథ విన్నప్పుడే ఇది తనకు సూట్ అవుతుందా లేదా అని తేల్చి చెప్పే సాయి పల్లవి ఏ సినిమాలో కూడా ఎలాంటి అసభ్యకరమైన పాత్రలో కానీ కనీసం ఒక్క సీన్ లో కానీ కనిపించలేదు. అదే ఆమెకు ఈ క్రేజ్ తెచ్చేలా చేసిందని చెప్పొచ్చు.

అయితే కథల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వదు కాబట్టే సాయి పల్లవి సినిమా సినిమాకు కొంత లేట్ అవుతూ వస్తుంది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ లా కాకుండా కథనాయిక పాత్రకు ఒక స్పెషల్ ఐడెంటిటీ తీసుకురావాలనే తాపత్రయం ఉన్న నటీమణుల్లో సాయి పల్లవి ఒకరు.

అందుకే లాస్ట్ ఇయర్ లో విరాటపర్వం, గార్గి సినిమాల తర్వాత తన నెక్స్ట్ సినిమా ఇంతవరకు ఓకే చేయలేదు సాయి పల్లవి. హీరోయిన్ గా సర్వైవల్ కోసం ఏ సినిమా పడితే ఆ సినిమా చేసే టైపు కాదు సాయి పల్లవి. అందుకే సాయి పల్లవి కోసం కొత్త కథలు రాస్తున్నారు దర్శకులు. సాయి పల్లవి మాత్రమే చేయగలదు అనేలా కథలను సిద్ధం చేస్తున్నారట. 3 సీన్లు, నాలుగు పాటల కోసం చేసే హీరోయిన్ కాదు సాయి పల్లవి తన పాత్ర ద్వారా తన సినిమా ద్వారా ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని అనుకుంటుంది ఆమె.

అందుకే సాయి పల్లవి సినిమాలన్నీ ప్రత్యేకంగా ఉంటున్నాయి. మరి మన వాళ్లు రెడీ చేస్తున్న కథలు అయినా సాయి పల్లవి ఓకే చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఈమధ్య కెరీర్ లో కొంత గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి మళ్లీ వరుస సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. సాయి పల్లవి తప్పకుండా మరో సెన్సేషనల్ మూవీతో ఆడియన్స్ ముందుకు రావాలని ఆశిద్దాం