సాయి పల్లవి పిసినారితనం చేస్తుందా!
రూపాయి రూపాయి కూడబెట్టి చిక్కం లో దాచే హీరోయిన్లు ఈరోజుల్లో ఎవరుంటారు?
By: Tupaki Desk | 11 May 2025 3:30 PMసెలబ్రిటీల ఖర్చులు ఎలా ఉంటాయన్నది చెప్పాల్సిన పనిలేదు. సాధారణ జీవితానికి భిన్నమైన లైఫ్ స్టైల్ వాళ్లది. ఖరీదైన కార్లు... విలాసవంతమైన విల్లా...లగ్జరీ లైఫ్ స్టైల్. వీకెంట్ పార్టీలు..నైట్ పార్టీలంటూ హీరోయిన్ల లైప్ వేరుగా ఉంటుంది. అవసరం మేర అదనంగా ప్రయివేట్ సెక్యూరిటీ కూడా నియమించు కుంటారు. కొందరికి రోజుల్లో లక్షల్లో ఖర్చు అవుతుంది. కోట్లలో ఆదాయం వస్తుంటే లక్షల్లో ఖర్చు పెట్టడం పెద్ద కష్టం కాదు.
రూపాయి రూపాయి కూడబెట్టి చిక్కం లో దాచే హీరోయిన్లు ఈరోజుల్లో ఎవరుంటారు? అలాంటి నటీమణులు భూతద్దం పెట్టి వెతికినా ఎవరూ కనిపించరు. కానీ నేన ఉన్నానంటూ ముందుకొచ్చింది ఓ పిసినారి హీరోయిన్. అవిడే సాయిపల్లవి. ప్రస్తుతం అమ్మడు క్రేజ్ ఎలా ఉందన్నది చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్..టాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. కోట్లలో ఆదాయం సమకూరుతుంది.
ఇంకా వాణిజ్య ప్రకటనలు చేయడం లేదు. లేదంటే? కంపెనీలు కోట్లు గుమ్మరించడానికి సిద్దంగా ఉన్నాయి. కానీ తనకంటూ కొన్ని పరిమితులు విధించేసుకునే సినిమాలు చేస్తుంది. ప్రకటనల జోలికైతే వెళ్లడమే లేదు. ఈ అమ్మడు ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందిట. రూపాయి ఖర్చు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుందిట. అక్కడ రూపాయి పెట్టడం వల్ల నాకేంటి? అని ఆలోచిస్తుందిట.
ఏదైనా కొనుక్కోవాలన్నా ఆలోచిస్తుందిట. ఇదంతా చిన్నప్పుడు అమ్మ నేర్పిన క్రమశిక్షణ అంటోంది. చిన్నప్పుడు అమ్మను ఏదైనా కవాలని అడిగితే అది అవసరామా? కాదా? అని ఆలోచించి నిర్ణయం తీసుకునేదిట. అసవరం అనుకుంటేనే ఖర్చు చేసేవారుట. కొన్ని సందర్భాల్లో బాధ కలిగినా పెద్దయ్యేకొద్ది ఆలోచిస్తే అమ్మ చేసింది కరెక్టే కదా అని రియలైజ్ అయ్యేదట. ఇప్పుడు తన చేతుల్లో డబ్బు ఉన్నా? అమ్మలాగే ఆలోచించి ఖర్చు చేస్తుందిట పల్లవి. ఆర్ధిక క్రమశిక్షణ ప్రతీ ఒక్కరికి చాలా ముఖ్యమని సూచించింది.