Begin typing your search above and press return to search.

సైంధవ్.. అందుకే ఈ దూకుడు

అయితే సైంధవ్ మూవీతో మాత్రం వెంకటేష్ మార్కెట్ పెరుగుతుందని భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. అసలే ఇది 75వ సినిమా.

By:  Tupaki Desk   |   30 Dec 2023 4:18 AM GMT
సైంధవ్.. అందుకే ఈ దూకుడు
X

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ మూవీ చేశారు. ఈ సినిమా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టొరీతో ఈ మూవీ తెరకెక్కింది. రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ స్పీడ్ అప్ చేశారు. విక్టరీ వెంకటేష్ స్వయంగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.

శ్రద్ధా శ్రీనాథ్ ఈ మూవీలో వెంకటేష్ కి జోడీగా నటించింది. తండ్రి, కూతుళ్ళ సెంటిమెంట్ ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. శుక్రవారం తండ్రి కూతుళ్ళ మధ్య నడిచే ఎమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. నవాజిద్దీన్ సిద్దీఖ్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. తమిళ్ హీరో ఆర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఓ విధంగా సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిప్రజెంట్ చేస్తూ ఉండటంతో క్యాస్టింగ్ ని కూడా అలాగే తీసుకున్నారు. ఆండ్రియా కూడా ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. సినిమా ప్రమోషన్స్ కోసం నార్త్ ఇండియా కూడా వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో సైంధవ్ ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ జనాల మధ్యకి వెళ్ళారు. ఐదు భాషలలో రిలీజ్ అవుతోన్న మూవీ కావడంతో అన్నిచోట్ల ప్రచారం చేయాలని అనుకుంటున్నారు.

విక్టరీ వెంకటేష్ గత కొన్నేళ్ళ నుంచి సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు. గురు మూవీ ఫ్లాప్ అనంతరం చాలా రోజుల తర్వాత ఎఫ్ 2 చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన మళ్ళీ గ్యాప్ తీసుకొని నారప్ప చేశారు. కానీ అది ఓటీటీలో విడుదలైంది. తరువాత ఎఫ్3 థియేటర్లలో వచ్చిన అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఏవి కూడా విక్టరీ వెంకటేష్ మార్కెట్ ని పెంచే చిత్రాలు కాలేకపోయాయి.

అయితే సైంధవ్ మూవీతో మాత్రం వెంకటేష్ మార్కెట్ పెరుగుతుందని భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. అసలే ఇది 75వ సినిమా. దీనికి తోడు ఈ సారి సంక్రాంతి రేసులో ఏకంగా ఐదు సినిమాలు పోటీ పడుతున్నాయి. మహేష్ గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగ, హనుమాన్ వంటి హైప్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. ఈ రేసులో జనాలని ఎట్రాక్ట్ చేయాలంటే కాస్తా హడావిడి ఉండాలని భావించి అందరికంటే ముందుగానే ప్రమోషన్స్ లో వెంకటేష్ దూకుడుగా వెళ్తున్నారు. మరి వెంకీ మార్కెట్ ను పెంచేలా సినిమా క్లిక్ అవుతుందో లేదో చూడాలి.