Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : పెద్ద గన్ తో ఫ్యామిలీ స్టార్‌ షాకింగ్ లుక్‌

ఫ్యామిలీ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న వెంకటేష్ ను ఇలాంటి యాక్షన్ లుక్ లో చూడటం నిజంగా షాకింగ్ గా ఉంది అంటూ కొందరు ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2023 3:55 PM GMT
పిక్ టాక్ : పెద్ద గన్ తో ఫ్యామిలీ స్టార్‌ షాకింగ్ లుక్‌
X

విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం సైంధవ్ సంక్రాంతి రిలీజ్ కన్ఫర్మ్‌ అయింది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా సౌత్‌ లో ఇతర భాషల్లో మరియు నార్త్‌ లో కూడా భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల అయ్యి అందరి దృష్టిని ఆకర్షించిన సైంధవ్‌ టీజర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


సినిమా టీజర్ ని అక్టోబర్‌ 16న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్‌ అంచనాలను భారీగా పెంచేస్తోంది. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ తో పోల్చితే ఈ పోస్టర్‌ వైల్డ్‌ గా.. షాకింగ్ గా ఉందని వెంకటేష్ అభిమానులతో పాటు సగటు తెలుగు సినీ ప్రేక్షకులు ఇంకా నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వెంకటేష్ చేతిలో పెద్ద గన్‌ తో పాటు సీరియస్ లుక్‌ ని చూడవచ్చు. ఫ్యామిలీ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న వెంకటేష్ ను ఇలాంటి యాక్షన్ లుక్ లో చూడటం నిజంగా షాకింగ్ గా ఉంది అంటూ కొందరు ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా తో వెంకీ భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాడని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

హిట్ సినిమా తో విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మొదటి సారి నవాజుద్దీన్ ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన చేరికతో సినిమా వెయిట్‌ భారీగా పెరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా శ్రద్దా శ్రీనాథ్‌ మరియు రుహానీ శర్మలు నటిస్తున్నారు.