Begin typing your search above and press return to search.

సైంధవ్ ట్రైలర్.. యాక్షన్ లో హై ఏమోషన్

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం 'సైంధవ్'

By:  Tupaki Desk   |   3 Jan 2024 6:16 AM GMT
సైంధవ్ ట్రైలర్.. యాక్షన్ లో హై ఏమోషన్
X

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం 'సైంధవ్'. వెంకటేష్ కెరియర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ అంచనాలను మరింత పెంచేశాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. రిలీజ్ టైం దగ్గర పడడంతో సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.


ఈ క్రమంలోనే ఈరోజు 'సైంధవ్' ట్రైలర్ ని రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లింది. తండ్రి, కూతురు అనుబంధం నేపథ్యంలో 'సైంధవ్' సినిమా ఉండబోతుందని ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. ముఖ్యంగా ట్రైలర్ అంతా యాక్షన్ తోనే నిండిపోయింది. తండ్రి గురించి కూతురు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది.

అలా తండ్రి, కూతుళ్ల బాండింగ్ ని చాలా బాగా చూపించారు. ఆ తర్వాత తన కూతురికి అనుకోని విధంగా ఓ సమస్య వస్తుంది. నరాల సమస్యతో బాధపడే తన కూతుర్ని బతికించుకోవడం కోసం తండ్రి పడే తపన ట్రైలర్లో చాలా ఎమోషనల్ గా చూపించారు. ఇన్నాళ్లు వెంకటేష్ నుంచి ఫ్యాన్స్ మిస్ అవుతున్న యాక్షన్ ఈ సినిమాలో ఫుల్ గా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్లో వెంకటేష్ చెప్పే డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

యాక్షన్ లవర్స్ కి ఈ సినిమా ఐ ఫీస్ట్ లా ఉండబోతుందని చెప్పొచ్చు. శైలేష్ కొలను గత సినిమాలతో సైంధవ్ కి ఎలాంటి పోలికలు లేవు. ఈ మూవీ కోసం. శైలేష్ యాక్షన్ అండ్ ఎమోషన్ ని ఎంచుకున్నాడు. వెంకటేష్ కి ఫ్యామిలీ ఇమేజ్ ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఇందులో కూతురు సెంటిమెంట్ ని యాడ్ చేశారు. ఇక ట్రైలర్ లో వెంకటేష్ తర్వాత బాగా హైలైట్ అయింది బాలీవుడ్ యాక్టర్ నమాజుద్దీన్ సిద్ధిక్.

ఈ సినిమాతోనే ఆయన తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇందులో విలన్ రోల్ చేశారు. ఆయన విలనిజం డైలాగ్ డెలివరీ హైలెట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత తమిళ హీరో ఆర్య కూడా ట్రైలర్ లో తనదైన యాక్షన్ తో ఆకట్టుకున్నారు. మొత్తంగా ఈ సంక్రాంతికి వెంకీ మామ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఆశించే ఎమోషన్స్ ఫ్యాన్స్ ఆశించే యాక్షన్ సైంధవ్ మూవీలో ఉంటాయని ట్రైలర్ తో చెప్పే ప్రయత్నం చేశారు. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.