Begin typing your search above and press return to search.

టీజర్: సైకో సైంధవ్.. ఊచకోత

కానీ ఇప్పటివరకు ఏ దర్శకుడు ఆ రేంజ్ లో ఆకట్టుకోలేదు. కానీ ఇప్పుడు శైలేష్ కొలను మాత్రం వెంకటేష్ ను తనదైన శైలిలో ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   16 Oct 2023 6:33 AM GMT
టీజర్: సైకో సైంధవ్.. ఊచకోత
X

విక్టరీ వెంకటేష్ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలు చేసి చాలా కాలం అయ్యింది. అయితే ఈసారి అతని నుంచి రాబోతున్న సైంధవ్ సినిమా మాత్రం అంతకుమించి అనేలా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు అందుకున్న వెంకటేష్ కు అలాగే మాస్ ప్రేక్షకుల్లో కూడా ఎల్లప్పుడూ అంచనాలు గట్టిగానే ఉంటాయి. పర్ఫెక్ట్ గా ఈ రెండు ఎమోషన్స్ ను హ్యాండిల్ చేయగలిగితే బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కూడా చూడవచ్చు.

కానీ ఇప్పటివరకు ఏ దర్శకుడు ఆ రేంజ్ లో ఆకట్టుకోలేదు. కానీ ఇప్పుడు శైలేష్ కొలను మాత్రం వెంకటేష్ ను తనదైన శైలిలో ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. వెంకటేష్ 75వ సినిమాగా రూపొందుతున్న సైంధవ్ సినిమా సంక్రాంతి జనవరి 13న రాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ను విడుదల చేశారు.

టీజర్ లో వెంకటేష్ ఒక పవర్ఫుల్ హీరోగా కనిపిస్తున్నాడు. ఇక విలన్స్ దృష్టిలో మాత్రం అతను సైకోగా ప్రజెంట్ చేశారు. చిన్నపిల్లలను ఉగ్రవాదులుగా తయారు చేసే ఒక ముఠాలో ఎదిరించే వ్యక్తిగా సైంధవ్ కనిపించబోతున్నాడు. అయితే సైంధవ్ సీక్రెట్ ఏజెంటా? లేక అతన్ని స్పెషల్ ఆఫీసర్ గా చూపించబోతున్నారా అనేది సినిమాలో చూడాలి.

కానీ హ్యాపీగా ఫ్యామిలీ తో ఉన్న ఒక వ్యక్తి మళ్లీ ఒక ఉగ్రవాదుల మిషన్ ను ఎదిరించేందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఉగ్రవాదుల ప్లాన్ ను హ్యాండిల్ చేసే వ్యక్తిగా నవాజుద్దీన్ కనిపించబోతున్నాడు. ఇక అతని ప్లాన్స్ ని ఎదిరించే సైంధవ్ ఏ విధంగా తన సైకోతనాన్ని చూపించాడు అనేది టీజర్ లో పవర్ఫుల్ గా హైలెట్ చేశారు.

చూస్తుంటే సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ లో ఊచకోక గట్టిగానే ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది. వెంకటేష్ గతంలో ఎప్పుడు లేనంత ఘోరంగా ఈ సినిమాలో విలన్స్ పై దాడి చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో కూతురిని ఎమోషన్ కూడా హైలెట్ కాబోతోంది. అలాగే ఉగ్రవాదులు అనే పాయింట్ ను కూడా దర్శకుడు హైలెట్ గా చూపించబోతున్నారు. మొత్తానికి ఒకవైపు కూతురు ఏమోషన్ మరొకవైపు ఉగ్రవాద ముఠాను ఎదిరించి సైంధవ్ టీజర్ తో మెప్పించాడు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.