Begin typing your search above and press return to search.

సైంధవ్ రిజల్ట్ డైరెక్టర్ ని రిస్క్ లో పడేసిందా..!

హిట్ 1, 2 సినిమాలతో క్రైం థ్రిల్లర్ కథనాలతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను డిఫరెంట్ అటెంప్ట్ గా చేసిన సినిమా సైంధవ్

By:  Tupaki Desk   |   26 Jan 2024 11:30 AM GMT
సైంధవ్ రిజల్ట్ డైరెక్టర్ ని రిస్క్ లో పడేసిందా..!
X

హిట్ 1, 2 సినిమాలతో క్రైం థ్రిల్లర్ కథనాలతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను డిఫరెంట్ అటెంప్ట్ గా చేసిన సినిమా సైంధవ్. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన వచ్చిన సైంధవ్ సినిమా సంక్రాంతి బరిలో వచ్చి నిరాశపరచింది. తను రాసుకున్న కథ బాగానే ఉన్నా ఎమోషన్స్ సరిగా వర్క్ అవుట్ కాకపోవడం యాక్షన్ పాళ్లు ఎక్కువవడం సైంధవ్ సినిమా ఈ ఫలితానికి కారణమయ్యాయి. సైంధవ్ సినిమా రిజల్ట్ డైరెక్టర్ శైలేష్ కొలనుకి మొదటి షాక్ ఇచ్చింది.

హిట్ ఫస్ట్ కేస్, హిట్ 2 సినిమాలతో తీసిన రెండు సక్సెస్ లను అందుకున్న శైలేష్ కొలను మొదటిసారి ఫ్లాప్ రుచి చూశాడు. సినిమా ఎంత కాన్ఫిడెంట్ గా తీసినా రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు. అయితే సైంధవ్ సినిమా ఒక సిన్సియర్ ఎఫర్ట్.. ఆ సినిమా రిలీజ్ టైం లో బ్యాడ్ రివ్యూస్ గుడ్ సినిమాను ఏమి చేయలేవని శైలేష్ కాస్త టెంప్ట్ అయ్యాడు. అయితే సినిమా గుడ్, బ్యాడ్ అనేది డిసైడ్ చేసేది ఆడియన్సే.

సైంధవ్ ఫ్లాప్ తో తను చేయబోతున్న హిట్ 3 విషయంలో కాస్త కన్ ఫ్యూజన్ ఏర్పడే అవకాశం ఉంది. కచ్చితంగా ఫ్లాప్ ఎఫెక్ట్ హిట్ 3 మీద పడొచ్చు. కానీ శైలేష్ మాత్రం ఈ కసితో రెట్టింపు ఉత్సాహంతో సినిమా చేయాలని చూస్తున్నాడు. హిట్ 3 లో నాని హీరోగా చేస్తున్నాడు. అసలైతే ఈ పాటికి సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉన్నా సరే కొంత టైం తీసుకుని సినిమా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు.

సైంధవ్ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా హిట్ 3 ని తెరకెక్కించాలని చూస్తున్నాడు శైలేష్. ఈ సినిమా విషయంలో శైలేష్ భారీ ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది. మరి శైలేష్ చేసే ఈ ఫోర్త్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. డైరెక్టర్ గా సైంధవ్ తో ఫస్ట్ షాక్ తిన్న శైలేష్ హిట్ 3 తో సెట్ రైట్ అవుతాడా లేదా అన్నది చూడాలి. హిట్ తో నాని హీరోగా చేయాల్సి ఉంది. అయితే నాని ప్రస్తుతం సరిపోదా శనివారం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో నాని సినిమా ఉంటుందని టాక్. మరి హిట్ 3 కి నాని డేట్స్ ఎప్పుడిస్తే అప్పుడు సినిమా చేయాలని చూస్తున్నాడు శైలేష్ కొలను.