Begin typing your search above and press return to search.

సైంధవ్ ఎఫెక్ట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కొత్త డిమాండ్

వెంకీ మామ ఈ మూవీలో విశ్వరూపం చూపించారని సినీ ప్రియులు రివ్యూలు ఇచ్చారు.

By:  Tupaki Desk   |   14 Jan 2024 12:30 PM GMT
సైంధవ్ ఎఫెక్ట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కొత్త డిమాండ్
X

విక్టరీ వెంకటేశ్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్. హిట్ ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన థియేటర్లోకి వచ్చింది. వెంకీ మామ ఈ మూవీలో విశ్వరూపం చూపించారని సినీ ప్రియులు రివ్యూలు ఇచ్చారు. కానీ ఓవరాల్ గా సినిమాకు మాత్రం మిక్స్ డ్ టాక్ అందించారు.

ముఖ్యంగా ఈ మూవీకి సంతోష్ నారాయణ్ అందించిన మ్యూజిక్ అస్సలు బాలేదని కంప్లైంట్లు వచ్చాయి. మంచి సీన్లకు కూడా సంతోష్ నారాయణ్ సో సో మ్యూజిక్ ఇచ్చారని వెంకీ మామ ఫ్యాన్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఓ 10 సీన్లకు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా అందించి ఉంటే.. సినిమాకు హైలైట్ గా నిలిచేవని అంటున్నారు.

ఈ సినిమా పాటలకు సంతోష్ నారాయణ్ కట్టిన బాణీలు అస్సలు సెట్ కాలేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇప్పటికైనా తమిళ సంగీత దర్శకులతో ప్రయోగాలు చేయడం ఆపాలని టాలీవుడ్ మేకర్స్ ను కోరుతున్నారు. అందరూ అనిరుధ్ లా ఉండరని అంటున్నారు. ఇంకొందరు.. ఈ సినిమాకు నవాజుద్ధీన్ సిద్ధిఖీ అసలు విలన్ కాదని, చెత్త మ్యూజిక్ అందించిన సంతోష్ నారాయణే విలన్ అని వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.

నాని దసరా సినిమాకు కూడా సంతోష్ నారాయణ్ సంగీతమే మైనస్ అని సినీ ప్రియులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీకి ఆయననే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు మేకర్స్. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సైంధవ్ సినిమాకే అలాంటి మ్యూజిక్ అందిస్తే.. రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తారోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంతోష్ నారాయణ్ ను వెంటనే కల్కి ప్రాజెక్ట్ నుంచి తప్పించాలని ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అలా చేయకుంటే సినిమాపై హైప్ తగ్గుతుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉందని చెబుతున్నారు. మరి కల్కి మేకర్స్.. ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.