Begin typing your search above and press return to search.

సైంధవ్ సెన్సార్ కంప్లీట్.. ఎలా ఉంటుందంటే..

థియేట్రికల్ రిలీజ్ కు అన్ని లైన్లు క్లియర్ అయినట్లు ప్రకటించింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు వెల్లడించింది.

By:  Tupaki Desk   |   30 Dec 2023 11:09 AM GMT
సైంధవ్ సెన్సార్ కంప్లీట్.. ఎలా ఉంటుందంటే..
X

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్.. ఈ సంక్రాంతికి సైంధవ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. హిట్‌ ఫేమ్ శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇటీవలే కలియుగ పాండవులు టు సైంధవ్ పేరిట హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.


ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, మూడు పాటలు సినీప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా మూవీ యూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. థియేట్రికల్ రిలీజ్ కు అన్ని లైన్లు క్లియర్ అయినట్లు ప్రకటించింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు వెల్లడించింది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 13వ తేదీన విడుదల కానుంది.

స్టోరీ లైన్ ఇదే..

ఈ మూవీలో వెంకటేశ్ కూతురు అరుదైన వ్యాధితో బాధపడుతుందంట. దీంతో ప్రతి తండ్రిలాగే వెంకీ కూడా అనేక కష్టాలు ఎదుర్కొంటారు. కుమార్తె వైద్యం కోసం రూ.17 కోట్లు విలువ చేసే ఇంజక్షన్ అవసరం ఉంటుంది. ఆ ఇంజక్షన్ విలన్ కు కూడా కావాల్సి ఉంటుంది. దాని కోసం ఇద్దరి మధ్య పోరాటం జరుగుతుందంట. తన కూతురితో కలిసి ఒంటరిగా ఉంటున్న వెంకటేశ్ కు సహాయం చేసేందుకు శ్రద్ధా శ్రీనాథ్ వస్తోందట. మరి చివరికి ఏం జరిగింది.. అదే సినిమా.

నిహారిక ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమా నిర్మిస్తున్నారు. కిషోర్ తాళ్లూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోశ్ నారాయన్ సంగీతమందిస్తున్నారు. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో సాగే సీక్రెట్ మిషన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ్ హీరో ఆర్య కీలక పాత్రలో నటిస్తున్నారు.

వెంకటేశ్ గత కొన్నేళ్ల నుంచి సినిమా సినిమాకు ఎక్కువ గ్యాపే తీసుకుంటున్నారు. గురు మూవీ ఫ్లాప్ తర్వాత చాలా నెలలకు ఎఫ్-2 చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయినా గ్యాప్ తీసుకుని నారప్ప చేశారు. ఆ తర్వాత ఎఫ్-3 నటించినా సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ సినిమాలేవీ వెంకీ మార్కెట్ ను పెంచలేకపోయాయి. అయితే సైంధవ్ మూవీతో మాత్రం వెంకటేశ్ మార్కెట్ పెరుగుతుందని అంతా భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.