Begin typing your search above and press return to search.

నోట్లో బుల్లెట్.. కింద నుంచి అలా ఎలా సైంధవ్?

అలా ఎలా సాధ్యమైందంటూ కామెంట్లు పెడుతున్నారు. విలన్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తి నోట్లో గన్ పెట్టి షూట్ చేస్తారు వెంకీ. వెంటనే ఆ బుల్లెట్ వెనుక వైపు నుంచి బయటకు వస్తుంది.

By:  Tupaki Desk   |   4 Jan 2024 4:01 AM GMT
నోట్లో బుల్లెట్.. కింద నుంచి అలా ఎలా సైంధవ్?
X

2024 సంక్రాంతి బరిలోకి దిగుతున్న సినిమాల్లో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ నటించిన సైంధవ్ మూవీ ఒకటి. ఈ సినిమా వెంకటేశ్ కు 75వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. బుధవారం ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ట్రైలర్ మాత్రం వేరే లెవెల్ లో ఉందని చెప్పొచ్చు. దర్శకుడు శైలేష్ సినిమా స్టోరీ లైన్ మొత్తాన్ని ట్రైలర్ లోనే చూపించేశారు. సైంధవ్ పాత్రపై ఉన్న ఎమోషన్ ను దర్శకుడు క్యారీ చేసిన విధానం మాత్రం సాలిడ్ గా ఉంది. విజువల్స్ అన్నీ చాలా రిచ్ గా కనిపిస్తుండగా.. వెంకటేశ్ ఒక్కొక్క యాక్షన్ సీన్ లో దుమ్ముదులిపేశారు. దీంతో ఎన్నో ఏళ్లు నుంచి మిస్ అవుతున్న అగ్రెసివ్ వెంకీ ని ఈ సినిమాతో చూడబోతున్నామన్నమాట.

అయితే ఈ ట్రైలర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉందని చెబుతున్న నెటిజన్లు.. ఒక్క సీన్ ను మాత్రం ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. అలా ఎలా సాధ్యమైందంటూ కామెంట్లు పెడుతున్నారు. విలన్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తి నోట్లో గన్ పెట్టి షూట్ చేస్తారు వెంకీ. వెంటనే ఆ బుల్లెట్ వెనుక వైపు నుంచి బయటకు వస్తుంది. ట్రైలర్ లో ఈ చిన్న సీన్ ను కట్ చేసి తెగ షేర్ చేస్తున్నారు. మరికొందరు ఆ బుల్లెట్ నోటి నుంచి వెనుక వైపు నుంచి ఎలా బయటకొచ్చిందన్న విషయమై వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. నోటి నుంచి బాడీలోకి వెళ్లి బుల్లెట్ ఎలా బయటకొచ్చిందనేది వీడియో ద్వారా సరదాగా వివరిస్తున్నారు.

ట్రైలర్ సాగిందిలా..

సినిమాలోని వెంకటేశ్ కుమార్తె మా నాన్న సూపర్ హీరో అంటూ చెప్పుకొస్తుంది. మరోవైపు వెంకటేశ్ కిరాతకంగా చంపుకుంటూ వస్తాడు. మా నాన్న ఉంటే నాకేం భయం కాదు.. అంటూ పాప చెబుతూ ఉంటుంది. శ్రద్ధా శ్రీనాధ్, వెంకటేశ్, కూతురు హ్యాపీగా సాగుతున్న వారి లైఫ్ లో ఓ సమస్య వస్తుంది. పాప ఓ జబ్బు బారిన పడుతుంది. అది నయం కావాలంటే.. రూ.17 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలి.

కట్ చేస్తే... సైకో ఈజ్ బ్యాక్ అంటూ విలన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇందులో విలన్ గా నటిస్తుండగా.. వెంకటేష్ యాక్షన్స్ సీక్వెన్స్ లు ఆకట్టుకుంటున్నాయి. నా తల తీసుకువస్తే డబ్బులు ఇస్తామని చెప్పారా.. నా తల తీసుకురావాలంటే.. మీ తలలు ఉండాలి కదరా అంటూ వెంకీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఇక సైంధవ్ గా వచ్చిన వెంకటేశ్ తన పాపను ఎలా కాపాడుకున్నాడు? విలన్స్ ను ఎలా అంతం చేశాడు? ఎందుకు సైకోగా మారి హత్యలు చేస్తున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇక ట్రైలర్ చివరలో పాప నిద్రపోతుంది. దగ్గరకు వస్తే చంపేస్తా అంటూ వెంకీ చెప్పే డైలాగ్ హైలెట్. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సంతోశ్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో వెంకీ మామ ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.