Begin typing your search above and press return to search.

సైంధవ్‌ : @75కి గట్టి ప్లాన్‌

విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి సైంధవ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   26 Dec 2023 5:32 AM GMT
సైంధవ్‌ : @75కి  గట్టి ప్లాన్‌
X

విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి సైంధవ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. 'హిట్‌' చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సైంధవ్‌ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.


ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు గాను సైంధవ్‌ మేకర్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. సైంధవ్ సినిమా వెంకటేష్ కెరీర్ లో మైలు రాయి సినిమా. ఆయన 75వ సినిమా అవ్వడంతో సైంధవ్ సినిమా ను నిర్మిస్తున్న నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ప్రత్యేక కార్యక్రమంను నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

జనవరి 13న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన వేడుకను డిసెంబర్‌ 27న హైదరాబాద్‌ లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ లో నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేకర్స్‌ చాలా స్పెషల్ గా ఈ కార్యక్రమంను నిర్వహించబోతున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

1986 లో కలియుగ పాండవులు సినిమాతో వెంకటేష్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు వెంకీ నుంచి 74 సినిమాలు వచ్చాయి. ఆ 74 సినిమాలకు సంబంధించిన ప్రత్యేక విషయాలను రేపు జరుగబోతున్న కార్యక్రమంలో చూడబోతున్నారు అంటూ కూడా నిర్మాణ సంస్థ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

సైంధవ్‌ సినిమా విషయానికి వస్తే బాలీవుడ్‌ స్టార్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటించడం తో అంచనాలు భారీగా పెరిగాయి. ఇంకా ఈ సినిమాలో ఆండ్రియా జెరెమియా, శ్రద్దా శ్రీనాథ్‌, ఆర్య మరియు రుహాని శర్మలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా తో వెంకీ చాలా రోజుల తర్వాత ఓ భారీ కమర్షియల్‌ హిట్‌ అందుకోబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ నమ్మకంగా కనిపిస్తున్నారు. సంక్రాంతికి ఉన్న విపరీతమైన పోటీ లో సైంధవ్‌ ఏ స్థాయి లో వసూళ్లు దక్కించుకుంటుందో చూడాలి.