Begin typing your search above and press return to search.

సుహాస్ చేసిన ప‌ని వ‌ల్ల 'హిట్ 2' షూటింగ్ ఆగిపోయేదా?

త‌ను లేక‌పోతే షూటింగ్ ఆగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను భ‌య‌ప‌డ్డార‌ట‌. దానిక కార‌ణం సుహాస్ మ‌రో సినిమా కోసం గుండు చేయించుకోవ‌డ‌మేన‌ట‌.

By:  Tupaki Desk   |   11 Oct 2023 7:37 AM GMT
సుహాస్ చేసిన ప‌ని వ‌ల్ల హిట్ 2 షూటింగ్ ఆగిపోయేదా?
X

హీరో ఫ్రెండ్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన యంగ్ అండ్, టాలెంటెడ్ సుహాస్ ఆ త‌రువాత చిన్న‌, లో బ‌డ్జెట్ సినిమాల‌కు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సిరీస్‌ల‌కు కెరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచాడు. త‌ను సైకో సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా న‌టించిన మూవీ 'హిట్ 2'. వ‌రుస‌గా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకున్న అడివి శేష్ క‌థానాయ‌కుడిగా న‌టించారు. ఇన్వెస్టిగేటివ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన 'హిట్‌'కు దీన్ని సీక్వెల్‌గా తెర‌కెక్కించారు. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ గ‌త ఏడాది డిసెంబ‌ర్ 2న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

ఇందులో సుహాస్ సీరియ‌ల్ కిల్ల‌ర్ సైకో కుమార్‌గా న‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. త‌న కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ ఆల‌స్యం అయ్యేద‌ని రీసెంట్‌గా ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను వెల్ల‌డించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఈ సినిమా షూటింగ్ ఆల‌స్యం అవుతుండ‌టంతో సుహాస్ డేట్స్ స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని, త‌ను లేక‌పోతే షూటింగ్ ఆగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను భ‌య‌ప‌డ్డార‌ట‌. దానిక కార‌ణం సుహాస్ మ‌రో సినిమా కోసం గుండు చేయించుకోవ‌డ‌మేన‌ట‌.

సుహాస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మూవీ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. దుశ్యంత్ క‌టిక‌నేని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ సినిమాని బ‌న్నీవాసుతో క‌లిసి ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మహ స‌మ‌ర్పించారు. ధీర‌జ్ మొగిలినేని నిర్మించిన ఈ మూవీ త్వ‌ర‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. అంతే కాకుండా టీజ‌ర్‌లోని ఓ స‌న్ని వేశం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

సినిమాలో మ‌ల్లిగాడు పాత్ర‌లో సుహాస్ న‌టించాడు. ఈ క్యారెక్ట‌ర్ అత్యంత స‌హ‌జంగా రావ‌డం కోసం కీల‌క స‌న్నివేశంలో సుహాస్ ఎలాంటి మేక‌ప్ ట్రిక్స్ వాడ‌కుండా స్వ‌యంగా గుండు చేయించుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చాలా వ‌ర‌కు కీల‌క న‌టులు రియ‌ల్‌గా సినిమా కోసం గుండు చేసుకున్న సంద‌ర్భాలు చాలా త‌క్కువ 'జెంటిల్‌మెన్‌' కోసం అప్ప‌ట్లో చ‌ర‌ణ్ రాజ్ ఓ సీన్లో రియ‌ల్‌గా గుండు చేయించుకుని న‌టించారు. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు సుహాస్ 'అంబాజీపేట మ్యారేజీబ్యాండు' కోసం గుండు చేయించుకుని న‌టించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.