Begin typing your search above and press return to search.

ఆ 20 నిమిషాలు ఓ అద్భుతం..!

ఆ 20 నిమిషాలు అస్సలు మిస్ అవ్వద్దు. ఆ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కి కారణం మా వెంకటేష్ గారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 7:01 AM GMT
ఆ 20 నిమిషాలు ఓ అద్భుతం..!
X

సంక్రాంతి సినిమాల రేసులో ముందు నుంచి కూడా జోష్‌ లో ఉన్న సైంధవ్‌ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. విడుదలకు నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ చేపట్టడం వల్ల సినిమా ను జనాల్లోకి ఎక్కువగా తీసుకు వెళ్లడం లో మేకర్స్ విజయాన్ని సొంతం చేసుకున్నట్లు అనిపిస్తోంది.

తాజాగా సినిమా గురించి దర్శకుడు శైలేష్ కొలను ఆసక్తికర ట్వీట్‌ ను చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతే కాకుండా సినిమా స్థాయిని మరింతగా పెంచాడు అనడంలో సందేహం లేదు. ట్విట్టర్ లో శైలేష్ కొలను స్పందిస్తూ... సినిమా ప్రింట్స్ డెలివర్‌ అయ్యాయి. ఇప్పుడు సినిమా మీది, మీ చేతుల్లో ఉంది.

సైంధవ్‌ సినిమాలోని చివరి 20 నిమిషాలు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ను ఇస్తుంది. ఆ 20 నిమిషాలు అస్సలు మిస్ అవ్వద్దు. ఆ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కి కారణం మా వెంకటేష్ గారు. అది మా వెంకటేష్ గారి వల్లే సాధ్యం. ఆయన అద్భుతమైన నటన సినిమా స్థాయిని పెంచిందని శైలేష్ ట్వీట్ లో పేర్కొన్నాడు.

తీవ్రమైన పోటీ ఉన్నా కూడా సంక్రాంతికి సైంధవ్ కచ్చితంగా బ్రేక్‌ ఈవెన్ వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకంను ట్రైలర్ విడుదల తర్వాత చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత వెంకీ అభిమానులు కోరుకుంటున్న తరహా సినిమా రాబోతుందనే అభిప్రాయాన్ని సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.