Begin typing your search above and press return to search.

హిట్ -3 సీక్రెట్ చెప్పిన డైరెక్ట‌ర్!

తాజాగా వాట‌న్నింటికీ శైలేష్ క్లారిటీ ఇచ్చేసాడు. 'సైంధ‌వ్' ప్ర‌చారంలో భాగంగా 'హిట్ 3' గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 'ప్రాంచైజీగా వ‌రుస‌గా అవే సినిమాలు తీసుకుంటే పోతే జ‌నాల‌కు బోర్ కొడుతుంది.

By:  Tupaki Desk   |   7 Jan 2024 2:30 AM GMT
హిట్ -3 సీక్రెట్ చెప్పిన డైరెక్ట‌ర్!
X

'హిట్' ప్రాంచైజీ ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రెండు భాగాలు భారీ విజ‌యంతో! త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఐడెంటిటీని సంపాదించుకున్నాడు శేలేష్. విక్ట‌రీ వెంక‌టేష్ ని డైరెక్ట్ చేసే ఆ అవ‌కాశం అదే ఐడెంటిటీ తెచ్చింద‌న్న‌ది వాస్త‌వం. ఇక 'హిట్ -3' కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని మెయిన్ లీడ్ పోషిస్తున్నాడు.

హిట్ -2 క్లైమాక్స్ లోనే ఆ విష‌యం చెప్పేసారు. నాని రోల్ డిజైన్ చేసిన వైనం అప్పుడే ఆస‌క్తిని రేకెత్తించింది. ఓ కొత్త నానినే శేలేష్ హిట్ 3 లో చూపించ‌బోతున్నాడ‌ని తేలిపోయింది. ఇలా రెండు విజ‌యాలు వ‌రుస‌గా అందుకున్నా హిట్ -3ని మాత్రం ఇంకా ప‌ట్టాలెక్కించ‌లేదు. నాని...శేలేష్ ఎవ‌రి సినిమాలు వారు చేసుకుంటున్నారు త‌ప్ప‌! ప్ర‌క‌టించిన ప్రాజెక్ట్ సంగ‌తేంటి? అన్న అంశం మీడియాలో చాలా సార్లు చ‌ర్చ‌కొచ్చింది.

ఎవ‌రికి వారు సినిమాలు చేసుకుంటే హిట్ అభిమానులు ఇంకెంత కాలం వెయిట్ చేయాలి? అన్న ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌చ్చాయి. తాజాగా వాట‌న్నింటికీ శైలేష్ క్లారిటీ ఇచ్చేసాడు. 'సైంధ‌వ్' ప్ర‌చారంలో భాగంగా 'హిట్ 3' గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 'ప్రాంచైజీగా వ‌రుస‌గా అవే సినిమాలు తీసుకుంటే పోతే జ‌నాల‌కు బోర్ కొడుతుంది. హిట్ నుంచి మొత్తం 7 క‌థ‌లు చెప్పాలి. హిట్ మొద‌టి భాగం హిట్ అయింద‌ని పార్ట్ 2 వెంట‌నే తీసాను. రెండు విజ‌యం సాధించాయ‌ని హిట్ 3ని వెంట‌నే తీస్తే హిట్ 4 తీసే స‌రికి జ‌నాల‌కి బోర్ కొడుతుంది.

లైట్ తీసుకుంటారు. అందుకే హిట్ 3ని కావాల‌ని ఆల‌స్యం చేస్తున్నాం. నాని నేను అనుకునే ఇలా చేస్తున్నాం. ఎవ‌రి సినిమాలు వారు చేసుకుందాం. రెండు మూడు సినిమాలు చేసిన త‌ర్వాత హిట్ 3ని మొద‌లు పెట్టే ప్లాన్ లో ఉన్నాం. క‌థ‌పై వ‌ర్క్ చేస్తున్నాను. పూర్తిగా వ‌దిలేయ‌లేదు. మంచి ఐడియా వస్తే దాన్ని నానికి షేర్ చేస్తున్నా. అత‌ని ఆలోచ‌న చెబుతున్నాడు. అన్నింటిని ఓ పుస్త‌కంలో రాసుకుంటున్నా' అని అన్నారు.