Begin typing your search above and press return to search.

హిట్ మేక‌ర్ నెక్స్ట్ ఎలా రాబోతున్నాడు?

హిట్ సిరీస్ నుంచి ఇంకా చాలా చిత్రాలు రావాల్సి ఉంది. వాట‌న్నింటిని శేలేష్ తెర‌కెక్కించ‌నున్నాడు. ఇప్ప‌టికే 'హిట్ -3'ని కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Feb 2024 1:30 PM GMT
హిట్ మేక‌ర్ నెక్స్ట్ ఎలా రాబోతున్నాడు?
X

యంగ్ మేక‌ర్ శేల‌ష్ కొల‌ను హ్యాట్రిక్ మిస్సైన సంగ‌తి తెలిసిందే. 'హిట్'..'హిట్-2' త‌ర్వాత 'సైంధ‌వ్' తోనూ హిట్ ప‌డితే హ్యాట్రిక్ న‌మోద‌య్యేది. కానీ జస్ట్ మిస్ అయింది. విక్ట‌రీ వెంక‌టేష్ తో భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కించిన ఈ ల్యాండ్ మార్క్ చిత్రం మైల్ స్టోన్ గా నిలిచిపోతుంద‌ని భావించారు కానీ అంచ‌నాల‌న్నీ త‌ల్లకిందుల‌య్యాయి. బాక్సాఫీస్ వ‌ద్ద రొటీన్ చిత్రంగా తేలిపోయింది. రెండు క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో వెంకీ తో భారీ స‌ర్ ప్రైజ్ ఉంటుంద‌ని అభిమానులంతా ఆశించారు గానీ తీవ్ర నిరుత్సాహాన్నే మిగిల్చాడు.

కానీ ఇదంతా పాస్ట్. వాట్ నెక్స్ట్ అన్న‌ది ఇక్క‌డ ఇంపార్టెంట్. వెంక‌టేష్ త‌దుప‌రి ప్రాజెక్ట్ తెర‌పైకి తెచ్చే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే అనీల్ రావిపూడి లైన్ లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. మ‌రి శైలేష్ కొల‌ను ప‌రిస్థితి ఏంటి? అంటే క్లారిటీ మిస్ అవుతుంది. హిట్ సిరీస్ నుంచి ఇంకా చాలా చిత్రాలు రావాల్సి ఉంది. వాట‌న్నింటిని శేలేష్ తెర‌కెక్కించ‌నున్నాడు. ఇప్ప‌టికే 'హిట్ -3'ని కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇందులో నేచుర‌ల్ స్టార్ నాని ర‌చిస్తున్న‌ట్లు రివీల్ చేసారు. 'హిట్ -2' క్లైమాక్స్ లోనే ఆవిష‌యం చెప్పేసారు. అప్ప‌టి వ‌ర‌కూ నిర్మాత‌గా ఉన్న నాని హిట్ వేవ్ చూసి తానే రంగంలోకి దిగేసాడు. అయితే 'హిట్-3' ఎప్పు డు ప‌ట్టాలెక్కిస్తారు? అన్న‌ది మాత్రం ఇంత‌వ‌ర‌కూ క్లారిటీ లేదు. మ‌రోవైపు నాని ఇత‌ర డైరెక్టర్లకి డేట్లు కేటాయిస్తున్నాడు త‌ప్ప 'హిట్-3'ని మాత్రం తెరపైకి తేవ‌డం లేదు. ప్ర‌స్తుతం నాని 'స‌రిపోదా శ‌నివారం' అనే సినిమా చేస్తున్నాడు.

ఇది పూర్త‌యిన త‌ర్వాత హిట్ -3కి డేట్లు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. హిట్ -2 రిలీజ్ అయి ఏడాది దాటిపోయింది. మూడ‌వ భాగానికి సంబంధించిన క‌థ కూడా సిద్దంగానే ఉంది. కానీ వెంట వెంట‌నే తెర‌కెక్కిస్తే కిక్ ఉండ‌ద‌ని శేలేష్ గ్యాప్ తీసుకుంటున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. కానీ సైంధ‌వ్ తో ప్లాప్ వ‌చ్చిన నేప‌థ్యంలో మ‌ళ్లీ హిట్ సిరీస్ వీలైనంత వేగంగా ప‌ట్టాలెక్కించే అవ‌కాశం క‌నిపిస్తుంది.