Begin typing your search above and press return to search.

హిట్ ఫ్రాంచైజ్ కి బ్రేక్ పడ్డట్టేనా..?

అడివి శేష్ హీరోగా చేసిన హిట్ 2 కూడా సక్సెస్ అందుకుంది. అదే సినిమాలో హిట్ 3 హీరోని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు

By:  Tupaki Desk   |   22 March 2024 10:30 AM GMT
హిట్ ఫ్రాంచైజ్ కి బ్రేక్ పడ్డట్టేనా..?
X

తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ కు ఈమధ్య మంచి డిమాండ్ ఏర్పడింది. థ్రిల్లర్ సినిమాల్లో సీట్ ఎడ్జ్ కూర్చో పెట్టే సస్పెన్స్ మెయింటైన్ చేస్తే చాలు సినిమా సూపర్ హిట్ అయినట్టే. తెలుగులో ఇలాంటి సినిమాలను ఫ్రాంచైజ్ లుగా తీయాలని ఫిక్స్ అయ్యాడు డైరెక్టర్ శైలేష్ కొలను. విశ్వక్ సేన్ హీరోగా హిట్ అంటూ మొదటి అటెంప్ట్ చేసిన శైలేష్ ఆ సినిమా సక్సెస్ అవ్వడం తో హిట్ 2 ది సెకండ్ కేస్ అంటూ రెండో ప్రయత్నం చేశాడు. అడివి శేష్ హీరోగా చేసిన హిట్ 2 కూడా సక్సెస్ అందుకుంది. అదే సినిమాలో హిట్ 3 హీరోని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు.

హిట్ 1, 2 సినిమాలు సక్సెస్ అవ్వడంతో హిట్ ఫ్రాంచైజ్ ల మీద ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ పెరిగింది. అయితే హిట్ 3 కి బదులుగా శైలేష్ కొలను తన థర్డ్ మూవీగా విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేశాడు. ఆ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. రెండు హిట్లు కొట్టిన డైరెక్టర్ థర్డ్ అటెంప్ట్ ఘోరంగా డిజాస్టర్ ఫేస్ చేశాడు. అయితే ఆ ఎఫెక్ట్ హిట్ ఫ్రాంచైజ్ మీద పడిందని తెలుస్తుంది.

అసలైతే ఈ పాటికి హిట్ 3 నానితో స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ నాని వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల హిట్ 3 లేట్ అవుతూ వస్తుంది. అయితే శైలేష్ రెడీ చేసిన హిట్ 3 స్క్రిప్ట్ కూడా నానిని సాటిస్ఫై చేయలేదని టాక్. అందుకే నాని కొంత టైం తీసుకోమని చెప్పాడని తెలుస్తుంది. హిట్ ఫ్రాంచైజ్ లను నాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందుకే హీరోగానే కాదు నిర్మాతగా కూడా నాని హిట్ ఫ్రాంచైజ్ ల మీద తన ఇన్ పుట్స్ ఇస్తున్నాడు.

హిట్ 3 ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారా లేదా ఫ్రాంచైజ్ ను పూర్తి గా ఆపేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే హిట్ ఫ్రాంచైజ్ కి బ్రేక్ పడినట్టే అని చెప్పుకుంటున్నారు. నాని ఎలాగు సూపర్ బిజీ కాబట్టి శైలేష్ తన నెక్స్ట్ సినిమా వేరే హీరోతో చేయాలని చూస్తున్నాడు. మరి శైలేష్ నాని కలిసి హిట్ ఫ్రాంచైజ్ లను కొనసాగిస్తారా లేదా అన్నది చూడాలి.