Begin typing your search above and press return to search.

శైలేష్ ఆ విష‌యంలో జాగ్ర‌త్త ప‌డాల్సిందే!

ఏ సినిమాలో అయినా హీరో, విల‌న్ క్యారెక్ట‌ర్లు ఎంత‌ స్ట్రాంగ్ గా, పోటాపోటీగా ఉంటే సినిమాలోని క‌థ‌నం అంత ర‌క్తి క‌డుతుంది.

By:  Tupaki Desk   |   3 May 2025 3:58 PM
Sailesh Kolanu Struggles with Powerful Villains
X

ఏ సినిమాలో అయినా హీరో, విల‌న్ క్యారెక్ట‌ర్లు ఎంత‌ స్ట్రాంగ్ గా, పోటాపోటీగా ఉంటే సినిమాలోని క‌థ‌నం అంత ర‌క్తి క‌డుతుంది. వారిద్ద‌రిలో ఏ ఒక్క‌రి పాత్ర బ‌ల‌హీనంగా ఉన్నా సినిమా మొత్తానికి వీక్ అయిపోతుంది. కానీ కొన్ని సినిమాలు వాటికి అతీతం. విల‌న్ పాత్ర‌లు వీక్ గా అనిపించిన‌ప్ప‌టికీ సినిమాపై ఉన్న హైప్ ఆ సినిమాల‌ను స‌క్సెస్ అయ్యేలా చేస్తుంది.

శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమాలు కూడా అంతే. ఇప్ప‌టివ‌ర‌కు శైలేష్ తీసిన సినిమాల్లోని విల‌న్ పాత్ర‌ల‌న్నీ బ‌ల‌హీన‌మైన‌వే. రీసెంట్ గా నాని హీరోగా వ‌చ్చిన హిట్: ది థ‌ర్డ్ కేస్ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో దూసుకెళ్తోంది కానీ ఆ సినిమాలో అందరికీ ఉన్న అసంతృప్తి విల‌న్ పాత్ర‌దే. హిట్3లో విల‌న్ ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్ పాత్ర చాలా వీక్ గా ఉంది.

మిగిలిన స్క్రిప్ట్ మొత్తాన్ని శైలేష్ ఎంత ప‌క‌డ్బందీగా రాసుకున్న‌ప్ప‌టికీ విల‌న్ విష‌యంలో స్ట్రాంగ్ బ్యాక్ డ్రాప్ లేక‌పోవ‌డం సినిమాను కాస్త వీక్ గా మార్చింది. అయితే శైలేష్ ఈ పొర‌పాటు ఈ ఒక్క సినిమాకు చేసింది కాదు. గ‌తంలో తాను తెరకెక్కించిన సినిమాల‌న్నీ ఇదే బాట‌లో వెళ్లాయి. వెంక‌టేష్ హీరోగా తీసిన సైంధ‌వ్ కోసం బాలీవుడ్ నుంచి న‌వాజుద్దీన్ సిద్దిక్ లాంటి గొప్ప న‌టుడిని తీసుకొచ్చాడు.

కానీ అత‌ని పాత్ర‌ను చాలా తేలిపోయేలా చేశాడు శైలేష్. అంత గొప్ప న‌టుడితో మంచి యాక్టింగ్ చేయించుకోవాల్సింది పోయి శైలేష్ అత‌ని పాత్ర‌ను డిజైన్ చేసిన విధానం అంద‌రినీ నిరుత్సాహ ప‌రిచింది. హిట్2లో కూడా సుహాస్ ను రివీల్ చేసే వ‌ర‌కు న‌డిపించిన ట్విస్ట్ షాకింగ్ గా ఉన్న‌ప్ప‌టికీ క‌థ‌లో ఇంకాస్త ఇంటెన్స్ ఉంటే బావుండేదని అప్ప‌ట్లో గ‌ట్టిగానే మాట్లాడుకున్నారు.

ఇక హిట్1 క్లైమాక్స్ కూడా అంతే. ఆ క్లైమాక్స్ లోని ట్విస్ట్ ను అంద‌రూ ముందే ఊహించ‌డంతో పాటూ ఆ ట్విస్ట్ సినిమా క‌థ‌కు సూట‌వ‌లేద‌నే కామెంట్స్ క్రిటిక్స్ నుంచి వ‌చ్చాయి. హిట్‌వ‌ర్స్ లో వ‌చ్చిన సినిమాల‌న్నీ స‌క్సెస్ అయిన‌ప్ప‌టికీ వాటిలో విల‌న్ పాత్ర‌లు ఇంకాస్త బ‌లంగా ఉంటే సినిమాకు ఇంకా మంచి రిజ‌ల్ట్ వ‌చ్చేద‌న్న‌ది వాస్త‌వం. కాబ‌ట్టి ఇక‌నైనా శైలేష్ విల‌న్ పాత్ర‌లు రాసుకునే విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.