హిట్ 3 లైఫ్ లేకుండా చేయకూడదంటే..?
డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది అంటే తమలోని టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు.
By: Tupaki Desk | 29 April 2025 6:31 AMడైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది అంటే తమలోని టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా క్రైం థ్రిల్లర్ తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. అతను చేసిన హిట్ 1, 2 సినిమాలు సక్సెస్ అయ్యాయి. హిట్ యూనివర్స్ లో హిట్ థర్డ్ కేస్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐతే హిట్ 2 తర్వాత డైరెక్టర్ శైలేష్ విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉండగా అది కాస్త డిజాస్టర్ అయ్యింది.
శైలేష్ సైంధవ్ ని ఒక మిషన్ లా కంప్లీట్ చేశాడు. సినిమా టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటుంది. కానీ ఆడియన్స్ కి కావాల్సిన ఎమోషన్ ని పట్టుకోలేకపోయాడు. అందుకే ఆ సినిమా మిస్ ఫైర్ అయ్యింది. ఐతే ఫ్లాప్ పడిన డైరెక్టర్ కి మరో ఛాన్స్ రావడం చాలా కష్టం. కానీ సైంధవ్ ఫ్లాప్ పడ్డా కూడా నాని హిట్ సీక్వెన్స్ కి ఛాన్స్ ఇచ్చాడు. హిట్ 3 సినిమాలో నాని నటించడం కూడా ప్లస్ పాయింటే అని చెప్పొచ్చు.
హిట్ 3 సినిమాతో శైలేష్ కచ్చితంగా తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఇది అతని కెరీర్ ని డిసైడ్ చేసే సినిమా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక డిజాస్టర్ తర్వాత ఎలా లేదన్నా మూడు నాలుగేళ్లు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. కానీ శైలేష్ కి సైంధవ్ ఫ్లాప్ పడినా కూడా వెంటనే నాని హిట్ 3 ఛాన్స్ ఇచ్చాడు. ఐతే హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న హిట్ 3 మీద అంచనాలైతే భారీగా ఉన్నాయి. ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
శైలేష్ కూడా హిట్ యూనివర్స్ ని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తూ వస్తున్నాడు. మరి హిట్ 3 శైలేష్ కి సక్సెస్ అందిస్తుందా. ఆ డైరెక్టర్ మళ్లీ మళ్లీ సినిమాలు తీసేలా పుష్ చేస్తుందా అన్నది చూడాలి. హిట్ 3 కాదు హిట్ ఫ్రాంచైజీలు భారీ ఐడియాలు ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు చివరి భాగంలో హిట్ హీరోలంతా కూడా కనిపించేలా శైలేష్ ప్లానింగ్ ఉందని తెలుస్తుంది.