డైరెక్టర్ కొడుకుతో వెంకీ ఫ్రెండ్‌షిప్
రీసెంట్ గా హిట్3తో సక్సెస్ అందుకున్న శైలేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెంకటేష్ తో తన అనుబంధాన్ని, రిలేషన్‌షిప్ ను షేర్ చేసుకున్నాడు.
By: Tupaki Desk | 7 May 2025 9:45 AMహిట్‌వర్స్ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శైలేష్ కొలను. మధ్యలో శైలేష్, విక్టరీ వెంకటేష్ హీరోగా సైంధవ్ అనే సినిమా కూడా తీశాడు. గతేడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే సైంధవ్ సినిమా దారుణమైన ఫ్లాప్ గానే మిగిలింది.
రీసెంట్ గా హిట్3తో సక్సెస్ అందుకున్న శైలేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెంకటేష్ తో తన అనుబంధాన్ని, రిలేషన్‌షిప్ ను షేర్ చేసుకున్నాడు. తమ కలయికలో వచ్చిన సైంధవ్ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయిందని, ఎప్పటికైనా వెంకీ గారితో మళ్లీ సినిమా తీసి మంచి హిట్ ను ఇస్తానని చెప్పాడు శైలేష్.
సైంధవ్ రిలీజయ్యాక రెండు వారాల పాటూ రోజూ ఉదయాన్నే 9 గంటలకు వెంకీ సర్ నుంచి ఫోన్ వచ్చేదని, రిజల్ట్ ను పట్టించుకోకు. డల్ గా ఉండకు, లేచి ఆఫీస్ కు వెళ్లు, వెళ్లి రోజూ 20 పేజీలు ఏదొకటి రాసుకో అంటూ మోటివేట్ చేసేవారని, తన ఆఫీస్ కు పిలిచి చాలా సేపు మాట్లాడేవారని, సినిమాలు, వాటి రిజల్ట్ తమ బాండింగ్ ను ఏ విధంగా ప్రభావితం చేయలేదని, ఆ టైమ్ లో ఆయన ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనని, ఆయనతో తీసిన సైంధవ్ ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమా తర్వాత వెంకీ సర్ ఫ్యామిలీ మెంబర్ అయిపోయారని చెప్పాడు శైలేష్.
వెంకీకి తన కొడుకు రోజూ ఐదారు వీడియోలు పంపిస్తాడని, దానికి ఆయన కూడా రిప్లై ఇస్తుంటారని, వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని, రీసెంట్ గా చెట్లు కొట్టే విషయంలో వెంకీ గారికి ఫోన్ చేసి, వెంకీమామ చెట్లు కొట్టేస్తున్నారు, ఏదొకటి చెయ్ మామ అంటూ కంప్లైంట్ చేశాడని, వారిద్దరి మధ్య ఓ రకమైన ఫ్రెండ్‌షిప్ ఉందని కూడా శైలేష్ ఈ సందర్భంగా వెల్లడించాడు.
ఆల్రెడీ తామిద్దరం కలిసి ఓ సినిమా చేయాలని మాట్లాడుకున్నామని, కచ్ఛితంగా ఇద్దరం కలిసి సాలిడ్ కంబ్యాక్ ఇస్తామని, తమ బ్యూటిఫుల్ రిలేషన్ ఆ సినిమాను మరింత మెరుగ్గా చేస్తుందని చెప్పిన శైలేష్, ఆయనకు మంచి హిట్ ఇస్తే అదే ఆయనకు తాను చేసే మంచి అవుతుందని, దానిపై తాను వర్క్ చేయనున్నట్టు శైలేష్ చెప్పాడు.