హిట్4 గురించి డైరెక్టర్ ఏమంటున్నాడంటే
హిట్‌వర్స్ డైరెక్టర్ శైలేష్ కొలను హిట్3 ను మరింత వయొలెంట్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 4 May 2025 10:30 AMహిట్‌వర్స్ డైరెక్టర్ శైలేష్ కొలను హిట్3 ను మరింత వయొలెంట్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ఈ సినిమా గురువారం రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుని, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. ఎప్పటిలానే హిట్3 క్లైమాక్స్ లో నెక్ట్స్ హిట్4 లో హీరో ఎవరనేది పరిచయం చేశాడు శైలేష్.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో శైలేష్ మాట్లాడుతూ హిట్4 కోసం తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను వెల్లడించాడు. హిట్4 కథ విషయంలో తానింకా ఓ నిర్ణయానికి రాలేదని, తనకు కేవలం ఒక ఆలోచన మాత్రమే ఉందని, దాన్ని ఇంకా ఫుల్ స్క్రిప్ట్ గా డెవలప్ చేయలేదని శైలేష్ తెలిపాడు. ప్రస్తుతం తాను ఫ్యామిలీతో కలిసి సిడ్నీకి వెళ్తున్నానని చెప్పాడు.
కొడుకుతో కలిసి టైమ్ స్పెండ్ చేసి చాలా కాలమైందని, తాను, తన భార్య కూడా ఎప్పట్నుంచో కొంతకాలం పాటూ ట్రావెల్ చేయాలనుకున్నామని, అందులో భాగంగానే సిడ్నీ వెళ్తున్నామని చెప్పిన శైలేష్ కొన్ని నెలల పాటూ అక్కడే ఉండి, రైటింగ్ పై ఫోకస్ చేస్తానని, తన మైండ్ లో ఉన్న కొన్ని ఆలోచనలను ఫుల్ స్క్రిప్ట్ మార్చాలనుకుంటున్నానని వెల్లడించాడు.
అయితే వెకేషన్ లో తాను ఫుల్ స్క్రిప్ట్ పై ఫోకస్ చేస్తానని చెప్పాడు కానీ తన నెక్ట్స్ మూవీ హిట్4 అని మాత్రం శైలేష్ చెప్పలేదు. కానీ హిట్4 మాత్రం మిగిలిన మూడు సినిమాల కంటే భిన్నంగా ఉంటుందని శైలేష్ క్లారిటీ ఇచ్చాడు. హిట్4 ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతూనే, మునుపటి సినిమాల కంటే భిన్నంగా ఉంటుందని శైలేష్ తెలిపాడు.
ఇదిలా ఉంటే శైలేష్ ఓ రొమాంటిక్ కామెడీ చేయాలనే ఆలోచనలో శైలేష్ ఉన్నాడని తెలుస్తోంది. మరోవైపు శైలేష్ ఆల్రెడీ టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఓ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ చెప్పాడని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. నాగ్ కు ఆ కథ నచ్చిందని కూడా అంటున్నారు. మరి శైలేష్ తర్వాతి సినిమాను ఎవరితో చేస్తాడో చూడాలి. ఏదేమైనా కొన్నినెలల వరకు మాత్రం శైలేష్ తన రైటింగ్ పైనే దృష్టి పెట్టనున్నానని స్వయంగా అతనే క్లారిటీ ఇచ్చాడు.