ఆ డైరెక్టర్ అసలు టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిందే..!
హిట్ సీరీస్ లతో సక్సెస్ లు అందుకుంటున్న డైరెక్టర్ శైలేష్ కొలను రీసెంట్ గా హిట్ 3 తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు.
By: Tupaki Desk | 11 May 2025 12:30 AMహిట్ సీరీస్ లతో సక్సెస్ లు అందుకుంటున్న డైరెక్టర్ శైలేష్ కొలను రీసెంట్ గా హిట్ 3 తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. నాని లీడ్ రోల్ లో నటించిన ఈ హిట్ 3 సినిమాను శైలేష్ డీల్ చేసిన విధానం అదిరిపోయింది. క్రైం థ్రిల్లర్ సీరీస్ లో భాగంగా తెరకెక్కిన హిట్ 3 ని కామన్ ఆడియన్స్ కూడా థియేటర్ కి వచ్చి చూసేలా చేయడం గొప్ప విషయం. అఫ్కోర్స్ ఇందులో నాని క్రెడిట్ కూడా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నాని వరుస సక్సెస్ లలో హిట్ 3 కూడా చేరింది. ముఖ్యంగా నాని నుంచి ఈ రేంజ్ రక్తపాతం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.
ఇదిలా ఉంటే నాని డైరెక్టర్ శైలేష్ కొలను మీద పెట్టిన నమ్మకం చాలా గొప్పది. ఎందుకంటే హిట్ 1, 2 సినిమాలు తీశాక మధ్యలో విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ అనే సినిమా చేశాడు శైలేష్. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా ఫెయిల్యూర్ తో శైలేష్ చాలా డీలా పడ్డాడు. ఫ్లాప్ పడ్డా వచ్చి సినిమా చెయ్ అని నాని భరోసా ఇచ్చాడు. అలా పక్కన ఉండి మరీ సక్సెస్ ని ఇచ్చాడు.
ఐతే హిట్ 1 అండ్ 2 ఇప్పుడు 3 ఇలా హిట్ సీరీస్ లతో శైలేష్ సక్సెస్ లు అందుకుంటున్నాడు. కానీ హిట్ సీరీస్ కాకుండా శైలేష్ హిట్ కొట్టి చూపించాలి. అప్పుడే అతని ఒరిజినల్ టాలెంట్ బయటపడుతుంది. హిట్ అనేది ఒక క్రైం థ్రిల్లర్ జోనర్ సీరీస్ దీనికి ఒక వర్గం ప్రేక్షకులు నచ్చేలా చేస్తే సినిమా సక్సెస్ అయినట్టే. కానీ శైలేష్ మిగతా ఆడియన్స్ ని కూడా అలరించే సినిమాలు చేయాలి.
రీసెంట్ గా హిట్ 3 సక్సెస్ మీట్ లో నాని చెప్పినట్టుగా శైలేష్ నాని కలిసి ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ సినిమా చేయాలి. అది చేసి కూడా శైలేష్ సక్సెస్ కొడితే అప్పుడు డైరెక్టర్ గా శైలేష్ స్టామినా ప్రూవ్ అవుతుంది. ఐతే హిట్ ఫ్రాంచైజీలు కూడా చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నారని తెలుస్తుంది. హిట్ 4లో కోలీవుడ్ స్టార్ కార్తిని దించుతున్నారు. ఆ కథ దాని లెక్క వేరేలా ఉంటుందని నాని హింట్ ఇచ్చాడు. ఇదే కాదు రాబోతున్న హిట్ సీరీస్ లు కూడా వేరే లెవెల్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యేలా చేస్తున్నాడు నాని.