Begin typing your search above and press return to search.

'దేవర' సైఫ్ లుక్.. సైలెంట్ సైకోలా ఉన్నాడే

సైఫ్ అలీ ఖాన్ కర్లీ హెయిర్ తో చాలా సీరియస్ గా ఉండగా.. సముద్రం అలజడి, అందులో పడవలు కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 Aug 2023 9:19 AM GMT
దేవర సైఫ్ లుక్.. సైలెంట్ సైకోలా ఉన్నాడే
X

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవర సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొరడాల శివ ఆచార్యతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ కూడా మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తో దర్శకుడు బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగానే ప్రాజెక్టును సిద్ధం చేసుకుంటున్నాడు. ఫ్యాన్స్ కూడా ఈ దర్శకుడిపై ఈసారి ఎంతో నమ్మకంతో ఉన్నారు.


అలాగే సినిమాను ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా తెరపైకి తీసుకువస్తున్నారు. ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలయింది. ఇక టైటిల్ తో కూడా అంచనాల స్థాయిని పెంచేశారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నాడు అని తెలియగానే అన్ని లాంగ్వేజ్ లలో కూడా సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.

ఇక అతని ఫస్ట్ లుక్ ఎప్పుడప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మొత్తానికి చిత్ర యూనిట్ సభ్యులు పుట్టినరోజు సైఫ్ మొదటి పోస్టర్ను విడుదల చేశారు. సైఫ్ అలీ ఖాన్ కర్లీ హెయిర్ తో చాలా సీరియస్ గా ఉండగా.. సముద్రం అలజడి, అందులో పడవలు కనిపిస్తున్నాయి. ఇక అతను కూడా పవర్ఫుల్ అనే విధంగానే ఈ పోస్టర్ను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు.

అలాగే సైఫ్ లుక్కు చూస్తూ ఉంటే సైలెంట్ సైకోలో ఉన్నాడు అని కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తప్పకుండా కొరటాల శివ విలన్ పాత్రను ఈసారి చాలా పవర్ఫుల్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ లాంటి పవర్ఫుల్ హీరోను ఎదుర్కోవాలి అంటే ప్రతి నాయకుడు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. కాబట్టి సైఫ్ అలీ ఖాన్ పాత్రను సెలెక్ట్ చేసుకోవడంలో కొరటాల శివ బాగానే ఆలోచించాడు అని అనిపిస్తోంది.

ఈ సినిమాను ఒక ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇందులో డబుల్ యాక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఆ మధ్య టాక్ అయితే వినిపించింది. ఇక అప్డేట్స్ అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ పోస్టర్ తో కొంత మంచి కిక్ అయితే ఇచ్చారు. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.