Begin typing your search above and press return to search.

గాయంపై దేవర విలన్ ఏమన్నారంటే..

దేవర సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 Jan 2024 4:58 AM GMT
గాయంపై దేవర విలన్ ఏమన్నారంటే..
X

దేవర సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేవర చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే దేవర షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ కి గాయమైంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన చేతికి బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. తాజాగా తనకు ఆయన గాయంపై సైఫ్ అలీ ఖాన్ మీడియాకు క్లారిటీ ఇచ్చారు. గతంలో తనకి చేతి భుజంపై గాయం తగిలిందని అదే చోట మరల దేవర షూటింగ్ లో గాయం కావడంతో నొప్పి తీవ్రమైందని తెలిపారు.

ఈ నేపథ్యంలో డాక్టర్ ని సంప్రదించడం జరిగిందని, వెంటనే శాస్త్ర చికిత్స చేయాలని సూచించినట్లు క్లారిటీ ఇచ్చారు. గాయం తీవ్రత ఎంత అనేది ఇప్పుడే చెప్పలేనని, ప్రస్తుతానికి పర్వాలేదని అన్నారు. సమయానికి ట్రీట్మెంట్ చేసుకోకుంటే చేతిలో సగభాగం కోల్పోయే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ లో జాయిన్ అవుతున్నా అన్నారు..

సర్జరీ తర్వాత నెల రోజులు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు తెలియజేశారు. త్వరలో డిశ్చార్జ్ అయ్యి మీ ముందుకు వస్తానంటూ స్పష్టం చేశారు. అయితే సైఫ్ ఆలీ ఖాన్ కి సంబంధించిన మెజారిటీ సీక్వెన్స్ అన్నీ కూడా ఎప్పటికీ దేవర మూవీలో కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

కానీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. చిత్రం నిర్మాతలు మాత్రం ఏప్రిల్ 5న దేవర రావడం ఖాయమని ఈమధ్య ట్విట్టర్ లో కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె కెరియర్ లో కూడా భారీ బడ్జెట్ చిత్రం ఇదే కావడం విశేషం.