Begin typing your search above and press return to search.

ఆఫ్టర్ దేవర అతను బిజీ అవ్వడం ఖాయమా..?

నటుడంటే కేవలం లీడ్ రోల్ చేయడం కాదు సినిమాలో భాగం అవ్వడమే అని నమ్మిన సై తనకు సూటయ్యేలా ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తూ వచ్చాడు.

By:  Tupaki Desk   |   30 April 2024 4:42 PM GMT
ఆఫ్టర్ దేవర అతను బిజీ అవ్వడం ఖాయమా..?
X

బాలీవుడ్ స్టార్స్ లో దాదాపు 40 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ తన ఫాం కొనసాగిస్తున్నారు సైఫ్ అలీ ఖాన్. అప్పట్లో బాలీవుడ్ మల్టీస్టారర్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన సైఫ్ అలీ ఖాన్ సోలో సినిమాలతో కూడా సత్తా చాటారు. ఇప్పటికీ సైఫ్ తన కెరీర్ ని చాలా స్ట్రాంగ్ గా కొనసాగిస్తున్నారు. నటుడంటే కేవలం లీడ్ రోల్ చేయడం కాదు సినిమాలో భాగం అవ్వడమే అని నమ్మిన సై తనకు సూటయ్యేలా ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆయన్ను ప్రతినాయకుడిగా కూడా చూపించారు.

అయితే ఇన్నేళ్ల కెరీర్ లో బాలీవుడ్ సినిమాలనే చేస్తూ వచ్చిన సైఫ్ ఎన్టీఆర్ దేవరతో సౌత్ సినిమాళ్లోకి వస్తున్నాడు. దేవర సినిమా కోసం ఆయన విలన్ గా మారుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా అక్టోబర్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. దసరాకి దేవర హంగామా షురూ అయ్యేలా ఉంది. సినిమాలో భైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

స్టార్ హీరోల సినిమాల్లో విలన్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటే హీరోలు కూడా అంతకు మించి పవర్ ఫుల్ గా చూపిస్తారు. దేవర సినిమాలో సైఫ్ పాత్ర ఆయనకు చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెడుతుందని చెబుతున్నారు. దేవర లో ఆయన విలనిజం చూసి సౌత్ లో వరుస అవకాశాలు వస్తాయని. కొన్నాళ్లు ఆయన విలన్ గా తన ఫాం కొనసాగిస్తారని అంటున్నారు.

దేవర సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంది. అక్టోబర్ లో రిలీజైన దేవర 1 లో సైఫ్ నెగిటివ్ రోల్ క్లిక్ అయితే మాత్రం దేవర 2 వచ్చేలోగానే ఆయన్ను ఒకటి రెండు సినిమాల్లో విలన్ గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సౌత్ సినిమాకు యెస్ చెప్పడమే సైఫ్ కెరీర్ కొత్త ఉత్సాహన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది. మరి దేవర ఆయనకు ఎలాంటి క్రేజ్ తెస్తుందో చూడాలి. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తో గ్లోబల్ లెవెల్ లో ఎన్.టి.ఆర్ స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.