Begin typing your search above and press return to search.

భైరా బర్త్ డే హంగామా.. ఫిక్స్ వైరల్

కరీనా కపూర్ కూడా చాలా రోజుల తర్వాత మరల ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కారణంగా ఫోటోలలో కనువిందు చేసింది.

By:  Tupaki Desk   |   18 Aug 2023 5:23 AM GMT
భైరా బర్త్ డే హంగామా.. ఫిక్స్ వైరల్
X

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తోన్న దేవర సినిమాలోని విలన్ క్యారెక్టర్ భైరా లుక్ లో ప్రేక్షకులకి అందించారు. ఈ లుక్ నేచురాలిటీకి దగ్గరగా ఉంది. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. ఈ సినిమా తర్వాత సౌత్ నాట సైఫ్ అలీఖాన్ డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.

ప్రతినాయక పాత్రలు అయిన మళ్ళీ తనని తాను కొట్తగా రిప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పుట్టిన రోజు జరుపుకున్న సైఫ్ అలీఖాన్ తన బర్త్ డే సెలబ్రేషన్స్ మాత్రం కంప్లీట్ గా ఫ్యామిలీతో చేసుకోవడం విశేషం. అదికూడా తన మొదటి భార్య పిల్లలైనా సారా అలీఖాన్, కొడుకు ఇబ్రహీం కూడా పాల్గొన్నారు.





వారితో పాటుగా రెండో భార్య కరీనా కపూర్, తన పిల్లలు జహంగీర్ ఖాన్ పటౌడీ కూడా ఉన్నారు. పూర్తిగా ఒక రోజు మొత్తం ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేసి భార్య, పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సైఫ్ అలీఖాన్ కి పిల్లలంటే చాలా ఇష్టం. ఎక్కువగా వారితో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాడు.

అందుకే మొదటి భార్య పిల్లలని కూడా తన ఇంటికి పిలిపించుకొని వారితో కాలక్షేపం చేశారు. సారా అలీఖాన్ కూడా తండ్రి బర్త్ డే వేడుకలలో చాలా హ్యాపీగా స్పెండ్ చేసింది. కరీనా కపూర్ కూడా చాలా రోజుల తర్వాత మరల ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కారణంగా ఫోటోలలో కనువిందు చేసింది.

సైఫ్ ఆలీఖాన్ గత ఏడాది హిందీలో విక్రమ్ వేదా సినిమా చేశారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ ఏడాది ఆదిపురుష్ మూవీ కూడా అతనికి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఈ చిత్రంలో సైఫ్ ఆలీఖాన్ పోషించిన రావణ్ పాత్రపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తున్నారు.