Begin typing your search above and press return to search.

దేవర - భైర.. పేర్లతోనే స్టోరీలు అల్లేస్తున్నారు!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   17 Aug 2023 4:21 AM GMT
దేవర - భైర.. పేర్లతోనే స్టోరీలు అల్లేస్తున్నారు!
X

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో సిద్ధమవుతోన్న ఈ మూవీ కంప్లీట్ ఫిక్షన్ స్టోరి లైన్ తో ఐలాండ్ నేపథ్యంలో జరిగే కథాంశంగా ఉండబోతోంది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో హైలైట్ గా ఉంటాయని ఇప్పటికే కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి దేవర పాత్రలో ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేశారు. కత్తిపట్టుకొని సముద్ర అలలు వస్తూ ఉంటె సీరియస్ గా ఉన్న దేవర లుక్ అతనిని ఒక లీడర్ గా ప్రాజెక్ట్ చేస్తోంది. నల్ల బట్టలు కంటెంట్ బ్యాక్ డ్రాప్ ని మరింత పవర్ ఫుల్ గా ఎలివేట్ చేస్తోంది. చావంటే భయంలేని మానవ మృగాలని ఒకడు ఎలా భయపెట్టాడు అనేది ఈ మూవీ కథ అని కొరటాల శివ ఇప్పటికే సింగిల్ లైన్ లో చెప్పేశారు.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. తాజాగా అతనికి క్యారెక్టర్ కి సంబందించిన పోస్టర్ ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. సైఫ్ అలీఖాన్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ తో ట్రీట్ ఇచ్చారు. ఈ లుక్ లో పొడవైన హెయిర్ స్టైల్ తో బ్లాక్ డ్రెస్ లోనే సైఫ్ కనిపిస్తున్నాడు. ఆ క్యారెక్టర్ పేరు భైరాకి పరిచయం చేశారు.

దేవర, భైరా మధ్య నడిచే భీకర ఆధిపత్య పోరాటమే ఈ మూవీ కథాంశంగా ఉండబోతోందని పోస్టర్ తో మరికొంత స్పష్టత వచ్చింది. తాజాగా మూవీ గురించి ఇంటరెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో దేవర, భైరా అన్నదమ్ములుగా ఉంటారని, అయితే అన్న చేసే అక్రమాలు నచ్చక తమ్ముడు వాటికి ఎదురుతిరుగుతాడని కథ అల్లేశారు.

ఈ కథ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వస్తోంది. దేవర, భైరా పేర్లలో చివర్లో కామన్ గా 'రా' అనే అక్షరం ఉంది. దీంతో ఇద్దరు అన్నదమ్ములు అయ్యుంటారని నెటిజన్లు వారి స్టైల్ లో ఫిక్షనల్ స్టోరీస్ ని రెడీ చేసేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి ఈ స్టోరీలో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.