Begin typing your search above and press return to search.

వాస్తవంలో బ్రతుకుతా.. ఓటమి భయం లేదన్న స్టార్..

ప్రభాస్ లీడ్ రోల్ లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్

By:  Tupaki Desk   |   8 Feb 2024 11:30 PM GMT
వాస్తవంలో బ్రతుకుతా.. ఓటమి భయం లేదన్న స్టార్..
X

ప్రభాస్ లీడ్ రోల్ లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. లాస్ట్ ఇయర్ జూన్ లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. సినిమాలో ఆయన ఆ పాత్ర చేస్తున్నాడని తెలిసినప్పటి నుంచి రకరకాలుగా విమర్శలు చేశారు. ఇక సినిమా చూశాక అవి ఎక్కువయ్యాయి.

ఓ పక్క డైరెక్టర్ ఓం రౌత్ ని ట్రోల్ చేస్తూనే సైఫ్ ని కూడా ఓ ఆట ఆడుకున్నారు. అయితే వాటిని చాలా లైట్ తీసుకున్న సైఫ్ అలీ ఖాన్ లేటెస్ట్ గా ఆదిపురుష్ సినిమా గురించి స్పందించారు. ఇంతకీ సైఫ్ ఏమన్నారు అంటే తానెప్పుడు పెద్ద హీరోని అని అనుకోలేదని.. ఇకముందు కూడా అలా ఎప్పటికీ అనుకోనని అన్నారు. పేరెంట్స్ కూడా సినిమా పరిశ్రమకు చెందిన వారు అయినా కూడా ఎప్పుడు సాధారణ జీవితాన్నే గడిపానని అన్నారు.

జీవితంలో ఫోకస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాస్తవంలో బ్రతకాలని కోరుతా.. ఓటమి గురించి అసలు భయపడను అన్నారు సైఫ్ అలీ ఖాన్. అంతేకాదు ఆదిపురుష్ గురించి కూడా ఆయన స్పందించారు. ఆ సినిమాతో తాను రిస్క్ చేశానని అందరు అన్నారు. ఎంతోమంది విమర్శించారు. అయితే కొత్తగా ప్రయత్నించినప్పుడు అది హిట్ కాకపోయినా అధైర్య పడకూడదని అన్నారు. దురదృష్టం కొద్దీ అది విజయం సాధించలేదని అనుకోవాలి. ఆ తర్వాత సినిమాకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి. తాను అదే చేస్తానని అన్నారు సైఫ్ అలి ఖాన్.

ఆదిపురుష్ సినిమా ఓం రౌత్ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినా అదొక యానిమేషన్ మూవీ లాగా తీయడంతో పాటుగా 500 కోట్ల బడ్జెట్ పెట్టి విజువల్ ఎఫెక్ట్స్ సరిగా వాడకపోవడం లాంటివి ఆడియన్స్ కి షాక్ ఇచ్చాయి. అందుకే సినిమా ను ప్రేక్షకులు మెచ్చలేదు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ అవ్వడంపై సైఫ్ తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ దేవర సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. సైఫ్ చేస్తున్న మొదటి టాలీవుడ్ సినిమా ఇదే. దేవర సినిమా సైఫ్ రోల్ కూడా సర్ ప్రైజ్ చేస్తుందని టాక్. హీరో పాత్రకు ఏమాత్రం తగ్గకుండా విలన్ రోల్ ని తీర్చిదిద్దాడట కొరటాల శివ.