విడాకుల దిశగా స్టార్ కపుల్ అంటూ ప్రచారం
సోషల్ మీడియా- డిజిటల్ యుగంలో నిజం ఏదో అబద్ధం ఏదో కనిపెట్టడం కష్టంగా మారింది.
By: Tupaki Desk | 20 July 2025 6:00 AM ISTసోషల్ మీడియా- డిజిటల్ యుగంలో నిజం ఏదో అబద్ధం ఏదో కనిపెట్టడం కష్టంగా మారింది. సెలబ్రిటీలపై ఇష్టానుసారం కథనాలు వండి వారుస్తున్న మీడియాలు ఉన్నాయి. తప్పుడు కథనాలు సెలబ్రిటీల జీవితాల్లో కల్లోలానికి కారణమవుతున్న సందర్భాలున్నాయి. ఏది ఏమైనా కానీ ఇప్పుడు సైఫ్ అలీఖాన్ - కరీనా కపూర్ ఖాన్ జంటకు సంబంధించి పాకిస్తాన్ కి చెందిన ఒక యూట్యూబ్ చానెల్ వేసిన కథనం హాట్ టాపిగ్గా మారింది.
సైఫ్‌పై కత్తిపోట్ల కేసు ఇంకా కోర్టులో ఉన్నా కానీ, దీని గురించి ఇప్పుడు మీడియాలో వాడి వేడిగా చర్చ ఏదీ సాగడం లేదు. అయినా ఇంత గ్యాప్ తర్వాత పాకిస్తానీ యూట్యూబ్ చానెల్ వేసిన కథనం వేడెక్కించింది. ఈ కథనం ప్రకారం.. సైఫ్ ఖాన్ తన ఇంటి పని మనిషితో ఎఫైర్ పెట్టుకున్నందున, కరీనా కపూర్ ఖాన్ అతడిపై తీవ్రంగా దాడి చేసిందని సదరు యూట్యూబ్ చానెల్ కథనం వండి వార్చింది. తొందర్లోనే ఈ ఇద్దరూ విడిపోతున్నారు. విడాకులకు దరఖాస్తు చేసారని కూడా అడ్వాన్స్ డ్ గా కథనం వేసారు.
నిజానికి సైఫ్ - కరీనా కొంత కాలంగా కత్తిపోట్ల ఘటనను మర్చిపోయి హాయిగా ఉన్నారు. వారిపై అప్పట్లో వచ్చిన దారుణ మీడియా కథనాలను కూడా పెద్దగా పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉన్నారు. పనిమనిషితో ఎఫైర్ కథనం అప్పట్లోనే సంచలనం కూడా అయినా దానిపై ఆ జంట స్పందించలేదు. అయినా ఇంతకాలం తర్వాత ఇలాంటి ఒక ఔట్‌డేటెడ్ కథనంతో పాకిస్తానీ యూట్యూబ్ చానెల్ క్లిక్ లు, లైక్ ల కోసం పాకులాడటం విచారకరం. సెలబ్రిటీ జీవితాలపై తప్పుడు కథనాలు అల్లి వైరల్ గా ఆదరణ పొందాలనుకోవడం హేయమైనది. అయితే ఇలాంటి తప్పుడు కథనాలను ప్రజలు నిజం అని భావిస్తే ఆధారాలు లేని కథనం వేసినందుకు, చట్టబద్ధంగా అన్నిటినీ మీడియా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పూర్తి బాధ్యత వహించాల్సింది మీడియానే.
