Begin typing your search above and press return to search.

'దేవర' విలన్‌ ఖరీదైన దొంగతనం

హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సిరీస్‌ మనీ హీస్ట్‌కు తెలుగు వర్షన్‌ అన్నట్లుగా 'జ్యువెల్‌ థీఫ్‌' సినిమా రూపొందింది అంటూ ప్రచారం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 March 2025 5:00 PM IST
దేవర విలన్‌ ఖరీదైన దొంగతనం
X

బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ ఇప్పటి వరకు ఎన్నో యాక్షన్‌ సినిమాల్లో హీరోగా నటించాడు. అంతే కాకుండా పలువురు హీరోలు నటించిన యాక్షన్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడం ద్వారా యాక్షన్‌ హీరోగా, నటుడిగా పేరు సొంతం చేసుకున్నాడు. అయితే 'జ్యువెల్‌ థీఫ్‌' కోసం సైఫ్ చేసిన యాక్షన్ చాలా స్పెషల్‌ అని, ఆయన కెరీర్‌లోనే చాలా స్పెషల్‌గా నిలిచి పోతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. కూకీ గులాటీ, రాబీ గ్రెవాల్‌ సంయుక్తంగా రూపొందించిన 'జ్యువెల్‌ థీప్‌' సినిమా బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. థియేట్రికల్‌ రిలీజ్ స్కిప్‌ చేసిన మేకర్స్‌ డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌కి ప్లాన్‌ చేసిన విషయం తెల్సిందే. ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం సైఫ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సిరీస్‌ మనీ హీస్ట్‌కు తెలుగు వర్షన్‌ అన్నట్లుగా 'జ్యువెల్‌ థీఫ్‌' సినిమా రూపొందింది అంటూ ప్రచారం చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్‌ ఈమధ్య కాలంలో ఎక్కువగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌ పాత్రల్లోనే నటిస్తున్నాడు. కానీ ఈ సినిమాలో లీడ్‌ రోల్‌లో నటించడంతో ఆయన అభిమానులకు ఈ సినిమా చాలా స్పెషల్‌ కానుంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను థియేట్రికల్‌ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ చేశారు. సినిమా కథ మొత్తం ఒక ఖరీదైన వజ్రం దొంగతనం చుట్టూ తిరుగుతుంది. ఆ ఖరీదైన దొంగతనం చేసింది ఎవరు? చేయించింది ఎవరు అనే విషయాలు సినిమాకు మెయిన్‌ పాయింట్‌ కానున్నట్లు చెబుతున్నారు.

సైఫ్ అలీ ఖాన్‌ గత ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు 'దేవర' సినిమాతో విలన్‌గా వచ్చిన విషయం తెల్సిందే. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్‌ పోషించిన పాత్రకు మంచి మార్కులు దక్కాయి. అంతే కాకుండా దేవర పార్ట్‌ 2 లో సైఫ్ పాత్ర మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత సైఫ్‌ లీడ్‌ రోల్‌లో రూపొందిన సినిమా కావడంతో బాలీవుడ్‌లో ఒక వర్గం ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. కానీ సినిమా స్ట్రీమింగ్‌ మొదలు అయిన తర్వాత కచ్చితంగా సక్సెస్ టాక్‌ దక్కించుకుంటే అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపిస్తారని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

బాలీవుడ్‌లో ఇటీవల పఠాన్‌, వార్‌ వంటి సూపర్‌ హిట్ యాక్షన్ కమర్షియల్‌ సినిమాలను రూపొందించిన సిదార్థ్ ఆనంద్‌ 'జ్యువెల్‌ థీఫ్' సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఆయన ఈ సినిమా కథపై వర్క్ చేశాడని, వార్‌ సినిమా రేంజ్‌లో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో సైఫ్‌ అలీ ఖాన్‌తో పాటు జైదీప్ అహ్లావత్‌, కునాల్‌ కపూర్‌, నికితా దత్తాలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఏప్రిల్‌ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇలాంటి భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాలను థియేటర్‌లో చూస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీలో సూపర్‌ హిట్‌ అయితే కనీసం వారం అయినా బిగ్‌ స్క్రీన్‌పై ఈ సినిమా స్క్రీనింగ్‌ అవుతుందేమో చూడాలి.